పాడేరు, అల్లూరి జిల్లా: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో రాజవొమ్మంగి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మంజూరు చేసిన రూ.13.39 లక్షల విలువైన వాహనాన్ని మత్స్యకారుడు ముమ్మన ఆదినారాయణకు శుక్రవారం ఐటిడిఏ కార్యాలయం వద్ద లబ్దిదారునికి అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5.31 లక్షల రాయితీని ప్రభుత్వం మంజూరు చేస్తాదని చెప్పారు. మిగిలిన రుణాన్ని సకాలంలో బ్యాంకుకు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ పధకాన్ని సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వి. అభిషేక్, డిఆర్ఓ పి. అంబేద్కర్, ఎల్ డి ఎం రవితేజ, జిల్లా ఫిషరీస్ అధికారి శ్రీనివాసరావు, ఎఫ్ డి ఓ సిహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]