భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వివిధ గ్రామాలలో సిసి రోడ్లకు,వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ చర్ల మండల కార్యదర్శి పోలిన లంకరాజు నేతృత్వంలో బిఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు మాట్లాడుతూ ఈ నిధులు రావడంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావుల కృషి ఎనలేనిదని బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుందనిఅన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
[zombify_post]