గుమ్మలక్ష్మీపురం: మండలంలోని వివిధ గురుకుల పాఠశాల లను పార్వతీ పురం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట తిక్కబాయి ఆశ్రమ పాఠశాలను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ తరగతి గదులకు వెళ్లి విద్యా ర్థులతో మాట్లాడారు. మెనూ అమలు తీరు, పాఠశాల ఆవరణలో పారిశుధ్యం తదితర అంశాలపై హెచ్ఎంతో మాట్లాడారు. అనంతరం గుమ్మలక్ష్మీపురంలో ఉన్న బాలికల పోస్టుమెట్రిక్ హాస్టల్‌ను ఆకస్మి కంగా సందర్శించారు. భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎవరూ బయటకు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గిరిజన బాలుర గురుకుల జూనియర్ కళాశాలను కూడా సందర్శించారు. ప్రిన్సిపాల్ యుగంధర్‌తో మాట్లాడారు. బాలుర గురుకుల పాఠశా లను సందర్శించి విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు.
[zombify_post]