– ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చాడు
– బెస్ట్ టీచర్ అవార్డు సొంతం చేసుకున్నాడు
–ఓ మారు మూల గ్రామానికి చెందిన నిరుపేద ఇతను. చిన్ననాటి నుంచి పట్టుదలతో, క్రమశిక్షణతో విద్యాభ్యానం చేశాడు. ఆర్థిక ఇబ్బందులనే డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ఒకవైపు చదువుకుంటూ… మరోవైపు ట్యూషన్ చెబుతూ జీవితం వెళ్లదీశారు. డిగ్రీ అనంతరం బిఈడి పూర్తి చేసి 2010లో మొదటిసారిగా సత్తువల్లి మండలం రేజర్లలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. అంతటితో ఆగక చదువు పట్ల ఉన్న శ్రద్ధతో పట్టువదలని విక్రమార్కునిలా ఎమ్మెస్సీ సైకాలజీ ఎంపి తెలుగు, ఎమ్మెస్సీ గణితం కోర్సులలో పట్టాలు సాధించాడు. సేవ కార్యక్రమాలలోనూ ఇదే వేగంతో ముందుకు సాగుతున్నాడు కంభంపాటి వెంకటేష్ ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ నుంచి అవార్డు అందుకున్నారు. వెంకటేష్ స్వగ్రామం వేంసూర్ మండలం రాయుడుపాలెం. ప్రస్తుతం సత్తుపల్లి గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. కరోనా సమయంలో సైతం… మన ఇంటికే మనబడి అనే నినాదంతో.. తన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠాలు బోధించడం ద్వారా వారి చదువుపై కరోనా ప్రభావం పడకుండా చూసిన ఘనత వెంకటేష్ దక్కింది. ప్రవృత్తిలో భాగంగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా… ఉపాధ్యాయ వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న వెంకటేష్ సేవా కార్యక్రమాల్లోనూ అదే నిబద్ధతతో పనిచేయడం ద్వారా నత్తుపల్లి ప్రాంత ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారు. కరోనా సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పేదలకు అవసరమైన నిత్యవసరాలను సొంత ఖర్చులతో అందజేశారు. కరోనా మందులకు సంబంధించిన అందజేశారు. హైదరాబాద్ కు చేతన ఫౌండేషన్ వారి సహకారంతో విద్యార్థులకు ప్రతిభగల పేద విద్యార్థులకు లాప్టాప్ లో అందించారు. అతకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను సత్తుపల్లి శాఖ గ్రంధాలయానికి వితరణగా చేశారు. గత సంవత్సరం భద్రాచలం ప్రాంతంలో వరద బాధితులకు వంట సామాగ్రి, బియ్యం, పుస్తకాలను అతని నుంచి సేకరించి అందజేశారు. తల సేమియా, గుండె జబ్బులు, క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. పలుమార్లు మార్లు తానే స్వయంగా రక్తదానం చేయడం తో పాటు ప్రమాదంలో గాయపడిన వారికి నిత్యవసరాలను అందజేశారు. పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు వితరణగా వెంకటేష్ తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులకు వితరణగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేయడంతో పాటు వారికి అవసరమైన వాటర్ క్యాన్లు, డిజిటల్ బోర్డులు తదితర సామాగ్రిని సమకూర్చారు.

గాంధీనగర్ పాఠశాల: ఆటల మీద విద్యార్థులకు చిత్రలేఖన పోటీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారు రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించేందుకు కృషి చేశారు. చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. తొలి మెట్టు కార్యక్రమంలో భాగంగా వెంకటేష్ ఉ పాధ్యాయులకు ప్రభుత్వం తరఫున ఆంగ్ల బోధన అభివృద్ధికి సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. వార్డులు ఎన్నో మచ్చుకు కొన్ని. 2009లో ఎన్టీఆర్ స్మారక పురస్కారాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి గవర్నర్ ఎస్ ఎల్ నరసింహన్ చేతులమీదుగా వెంకటేష్ అందుకున్నారు. 2010లో పద్మ భూషణ్ సి. నారాయణరెడ్డిచే ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. 2012లో జస్టిస్ చంద్రయ్యచే సేవా పురస్కార్ అవార్డును అందజేశారు. 2015లో హైదరాబాద్కు. చెందిన అంబేద్కర్ ఆర్ట్స్ అకాడమీ జాతీయ పురస్కారం అందుకున్నారు. 2016లో మానస సాహిత్య సాంస్కృతిక సంస్థ ద్వారా ఉపాధ్యాయ సేవ రత్న పురస్కార్ విజయవాడలో అందుకున్నారు. 2022లో గ్రీన్ ఇండియా పురస్కారం హైదరాబాదులో అందుకున్నారు. 2022లో ఇస్కాన్ ఇండియా వారిచే ఖమ్మంలో బెస్ట్, టీచర్ అవార్డు అందుకున్నారు. 2022 లో విజయవాడ వాసవి క్లబ్ వారిచే నంది పురస్కారం అందుకున్నారు. టీచర్లు సమాజ నిర్మాతలు ఉపాధ్యాయుని చేతిలో సమాజం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నాను. ఉపాధ్యాయులు తలుచుకుంటే సమాజంలో ఎన్నో అద్భుతాలు. సృష్టించవచ్చు. విద్యార్థులను అర్థం చేసుకొని వారి స్థాయికి తగ్గట్టుగా విద్యాబోధన చేయాలి. విద్యార్థులకు వారికి అభిరుచి ఉన్న ఆ రంగంలో చేర్చే విధంగా కృషి చేస్తున్నాను.
[zombify_post]