డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
అధికారం చేతిలో ఉందని ప్రభుత్వ డబ్బు 371 కోట్ల రూపాయలు అవినీతి చేసి నేనేం చెయ్యలేదు, నేను చాలా అమాయకుడిని అంటూ చంద్రబాబు తన నవరస నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆయనకు తోడు ఆయన దొంగల కంపెనీ సభ్యులు అందరూ గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
కొత్తపేటలో అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజ్ ఇంటివద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిర్ల మాట్లాడుతూ
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే కేబినెట్‌ను తప్పుదారిపట్టించి వెంటవెంటనే ఆయన అనునాయులచే ఓపెన్ చేయించిన షెల్ కంపెనీలకు ప్రభుత్వ సొమ్ము 371 కోట్ల రూపాయలను మళ్లించి అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వ సొమ్ము అవినీతికి పాల్పడితే దానిని విచారించిన చేసిన పోలీసు వారు పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఈ మాత్రం దానికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని, ప్రజాస్వామ్య దేశంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని గ్రహించాలని,
ఈ చర్యతో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం చాలా సంతోషిస్తారని అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ పేరిట చేసిన స్కాం ఇది అని, 3356 కోట్లలో 10 శాతం ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఎలాంటి అధికార చర్చలు లేకుండా 2 రోజుల్లో సొమ్ము ట్రాన్స్ఫర్ చేసేసి అవినీతికి తెరతీసారని అన్నారు.

జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ, సెబీ… ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తుచేసిన స్కాం ఇది అయినా సరే చంద్రబాబు నిర్దోషిని అంటూ అసత్యాలు చెప్తున్నారని,
తమకు తాముగా తయారుచేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్‌డెవల్‌మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్‌రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్‌ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్ ఐటెంగా. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం… అన్నీ ఆగమేఘాలమీద జరిగిపోయాయి.
ఈపద్ధతిలో కేబినెట్‌కు నోట్ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధనలకు, రూల్స్‌కు పూర్తిగా విరుద్ధం.
ఇక ఒప్పందం విషయానికొస్తే.. జీఓ ఒకలా ఉంటుంది, ఒప్పందం ఇంకోలా ఉంటుంది. జీవోలో ఉన్నది… ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు చేశారు?.
సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఒక్కపైసాకూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు ఎలా విడుదలచేసింది.
డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు కొర్రీలు పెడితే… విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్‌ఫైల్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదలచేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు.
సీఎంగారు చెప్పారు కాబట్టి విడుదలచేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు.
అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదలచేసిన ఈ డబ్బు పోయింది.
మన అధికారులేకాదు… సీమెన్స్ సంస్థకూడా ఇంటర్నల్ ఎంక్వయిరీ చేసి… 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.
ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు.
తమ కంపెనీలో పనిచేసే సుమన్‌బోస్ అనే వ్యక్తి మేనేజ్‌మెంట్‌నుగాని, లీగల్‌టీమ్‌కాని సంప్రదించలేదని సీమెన్స్ వాళ్లు ఏకంగా కోర్టుకు తెలియజేశారు.
ఈడబ్బు 70కిపైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చింది.
వాస్తవంగా ఈ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్‌బ్లోయర్ ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. విచారణ మొదలుపెట్టి… దాన్ని ముందుకు కొనసాగనీయకుండా పక్కనపెట్టేశారు.
ఇది ఎప్పుడైతే జరిగిందో… వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను మాయంచేసేశారు.
స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ/ స్కిల్లర్, డిజైన్‌టెక్ … ఈరెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా సెన్‌వాట్‌కోసం క్లెయిమ్ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి… ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం స్పందనలేదు.
ఒక పక్క చినబాబు లోకేష్ ఏమో తాట తీస్తాం, తోలు తీస్తాం అంటూ అధికార పార్టీ ఫ్లెక్సీలు యువగలం వాలంటీర్లతో చింపించి సంఘంలో గొడవలు రెచ్చగొట్టే పనిలో ఉన్నారని, లోకేష్ మాట పట్టుకుని తెలుగుయువత రెచ్చిపోతే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే అని గ్రహించాలి అని, యువత ఇలాంటి రెచ్చగొట్టే వారి మాటలు విని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
చంద్రబాబుకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు ఇస్తే వారికి సరైన సరైన సమాధానం ఇవ్వలేని మీకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని ఎద్దేవా చేశారు.
కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉండే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు చంద్రబాబునాయుడుకు చట్టబద్ధంగా నోటీసులు ఇస్తే కనీసం స్పందించని పవన్ కళ్యాణ్ ఆయనను పూర్తి ఆధారాలతో అరెస్టు చేస్తే ఆఘమేఘాల మీద స్పందించేసారని ప్రజలు ఇదంతా గమనించాలని అన్నారు.
[zombify_post]