రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందున, తన విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
- శనివారం నాడు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ ల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా తుది దశకు చేరుకుందని, కాబట్టి బూత్ స్ధాయిలో ఓటరు నమోదు కు కాంగ్రెస్ పార్టీ బూత్ ఇంఛార్జ్ లు క్ర్రషి చేయాలని అన్నారు.
- ప్రస్తుత ఓటరు జాబితాలు పరిశీలన చేసి, బూత్ లోని ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుని, కాంగ్రెస్ పార్టీ ప్రతి బూత్ నుండి అత్యధిక ఓట్లు పడే విధంగా పనిచేయాలని ఆయన అన్నారు.
- అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం వుందని ఆయన అన్నారు.ప్రతి ఒక్క నాయకుడు గ్రామాలలో పర్యటన చేయాలని, ప్రజలను కలిసి వారితో సత్సంబంధాలను కలిగి వుండాలని చెప్పారు. సెప్టెంబరు 17 వ తేదిన హైదరాబాదు లో జరగనున్న సోనియా గాంధీ సభను విజయవంతం చేయాలని అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని, పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తుందని, రెండు లక్షల ఉద్యోగాల భర్తి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు శ్రీనివాస్,ధరావత్ వెంకన్న,వల్దాస్ దేవేందర్,వెలుగు వెంకన్న,పిల్లల రమేష్ నాయుడు, స్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]