in ,

రాహుల్ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో సత్తుపల్లిలో భారీ ర్యాలీ తీసిన మానవతారాయ్

దేశం ఐక్యత కోసం రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడోయాత్ర నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో భారీ స్ఫూర్తి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ మానవతారాయ్ క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం నుండి బాలాజీ టాకీస్ నుండి బోసు బొమ్మ సెంటర్ వరకు మరియు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రాహుల్ గాంధీ సోనియా గాంధీ కలిపి ఉన్నటువంటి చిత్రపటానికి మానవతారాయ్ నేతృత్వంలో పలువురు మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామిశెట్టి సుబ్బారావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మానవతారాయ్ దేశం ఐక్యత కోసం మరియు మతసామరస్యం కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్లు నడిచి చరిత్ర సృష్టించారన్నారు. దేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ చూసి బిజెపి చేస్తున్నటువంటి కుట్రలు దేశ ప్రజలే తిప్పి కొట్టాలని మానవతారాయ్ పిలుపునిచ్చారు. పేద ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసి గాంధీలను భూమి ఆకాశాలున్నంతవరకు మనం కాపాడుకోవాలని రాయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రటరీ రావి నాగేశ్వరావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేశి రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఐ కృష్ణ, మందలపు శ్రీనివాస్ రెడ్డి,మేడా విజయ్ బాబు, ఫజల్ రెహమాన్ బాబా, పసల ఏడుకొండలు,బచ్చు చిన్న వెంకటేశ్వరరావు, వెల్లంపల్లి ఏడుకొండలు, దండు యోహాన,దామాల రాజు,ఎండి సమద్, డాక్టర్ రాజబోయిన ప్రసాదరావు, కొమ్మేపల్లి బాజీ, కొమ్మేపల్లి యాకూబ్, ఎన్టీఆర్ కాలనీ షఫీ, యూసఫ్ పటాన్, సింగపోగు చిన్న రంగయ్య, జానీ పాషా, గుగులోత్ కృష్ణ, జక్కుల కృష్ణయ్య , రవీంద్ర, ముద్దు, వెలిశాల నాగేంద్రాచారి, గుర్రాల దేవా ప్రియుడు, పచ్చి నీళ్ల శ్రీను, ఖాదర్ బాబా, పున్నమ్మ, రావిలాల సత్యవతి, సుందరమ్మ, వరపర్ల అనిల్, వరి కోటి వినోద్, గద్దల కిరణ్, అవినాష్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఉట్టి కొట్టిన ఎమ్మెల్యే సండ్ర

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలి