in ,

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మువ్వా జన్మదిన వేడుకలు

ఖమ్మం జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మువ్వా విజయ్ బాబు జన్మదిన వేడుకలు కల్లూరు పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేసి మువ్వాకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సుధాకర్ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మంచి పేరున్న నాయకులు మువ్వా విజయ్ బాబు అని అన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తన స్వశక్తితో ఎదిగి ఖమ్మం జిల్లాలోని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని జిల్లా ప్రజల గుండెల్లో సంపాదించారని అన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఒక సైనికులుగా పని చేస్తున్నామని అన్నారు. అనంతరం భారీ ఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యసా వెంకటేశ్వరరావు, కాటేపల్లి కిరణ్ కుమార్, వైకుంఠపు శ్రీనివాసరావు, యంగల సురేష్, నేపాల్, లక్ష్మణ్, మైబు, జొన్నలగడ్డ గోపాల స్వామి, శాముల్లా, మజ్జు, రాయల సుందరం, కంచెపోగు నరేష్, నల్లగట్ల జమాలయ్య, రావూరి సీతారాములు, మత్తి గోపాల్, గిద్దెల నాగరాజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పై తప్పుడు ప్రచారం

వైస్ చైర్మన్ పదవి మాల సామాజిక వర్గానికి – హర్షం వ్యక్తం చేసిన: జై భీమ్ శ్రీనివాస్*