ఎన్టీఆర్ జిల్లా నందిగామ సెప్టెంబర్ 6 గురు న్యూస్ :
నందిగామ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎస్సీ- మాల సామాజిక వర్గం కేటాయించడం పై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ న్యాయవాది ,తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షులు జై భీమ్ శ్రీనివాస్.ఇటీవల జరిగిన నందిగామ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన పాకలపాటి కృష్ణ అలియాస్ కిరణ్ ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు.
నందిగామ రాజకీయ చరిత్రలో , ఎస్సీ మాల సామాజిక చెందిన వారికి కీలక పదవులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

నందిగామ నియోజవర్గంలో ఉన్న వీరులపాడు మండల జడ్పిటిసిగా కీలక పదవి ఎస్సీ-మాల కు అతిపెద్ద గ్రామపంచాయతీ , కంచికచర్ల సర్పంచ్ గా కీలక పదవి ఎస్సీ- మాల కు కంచికచర్ల మండల , వైస్ ఎంపీపీగా కీలక పదవి ఎస్సీ- మాల కు కంచికచర్ల మండలం, కీసర గ్రామపంచాయతీ సర్పంచిగా ఎస్సీ మాల కు గండేపల్లి , వేములపల్లి గ్రామాలకు ఎంపీటీసీలుగా ఎస్సీ మాల కు నందిగామ మున్సిపాలిటీ కో – ఆప్షన్ మెంబర్ గా ఎస్సీ- మాల కు కమ్మవారిపాలెం గ్రామ సర్పంచిగా ఎస్సీ- మాల కు మునగాలపల్లి గ్రామ ఎంపీటీసీగా, వైస్ సర్పంచిగా ఎస్సీ-మాల కు నందిగామ నియోజకవర్గంలో కీలకమైన పదవులు ఎస్సీ – మాల సామాజిక వర్గానికి రావడంలో స్థానిక ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు పాత్ర కీలకమైంది.కావున ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు జై భీమ్ శ్రీనివాస్ తెలిపారు గత ప్రభుత్వంలో నందిగామ నియోజవర్గంలో ఎస్సీ – మాల సామాజిక వర్గాన్ని పట్టించుకోని, రాజకీయ పార్టీని భవిష్యత్తులో భూస్థాపితం చేస్తారని తెలిపారు.
వైఎస్ఆర్సిపి పార్టీ ఎస్సీ-మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి , కీలక పదవులు ఇచ్చినందున భవిష్యత్తులో మొండితోక బ్రదర్స్ కి ఎస్సీ -మాల అందరూ అండగా నిలబడాలని జై భీమ్ శ్రీనివాస్ కోరారు.
[zombify_post]