తెలుగు ప్రజలకు చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ విడుదల చేశారు. నేను జైలులో లేను.. ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు. ప్రజల నుంచి ఒక్క క్షణం కూడా నన్నెవరూ దూరం చేయలేరని చంద్రబాబు వెల్లడించారు.45 ఏళ్లుగా కాపాడుకుంటున్న విలువలు, విశ్వసనీయతను చెరపలేరని ఆయన పేర్కొన్నారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తోంది.. త్వరలోనే బయటకొస్తానని చెప్పారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించి ఉత్సాహంతో పనిచేస్తాని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఓటమి భయంతోనే జైలులో ఉంచి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు. ఈ చీకట్లు తాత్కాలికమే.. త్వరలోనే కారుమబ్బులు వీడతాయన్నారు. త్వరలో బయటకు వచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని చంద్రబాబు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!