in ,

టెన్నిస్ క్రీడాకారుడు శివాజీ 9న రాజమండ్రికి రాక

అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడా పోటీల్లో

`రెండు పతకాలు సాధించిన  పిల్లా శివాజీ

`8న ఇండియాకు,

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 6: గ్రీస్‌ లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడా పోటీల్లో రాజమండ్రి కెమిస్ట్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌   అధ్యక్షుడు పిల్లా బాల కుమారుడు..శివాజీ రెండు పతకాలు సాధించాడు. స్థానిక ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  బాల మాట్లాడుతూ విటి కాలేజీలో ఇంటర్‌ మీడియట్‌ రెండవ సంవత్సరం చదువుతున్న శివాజీ వరల్డ్‌ డెఫ్‌ ఛాంపియన్‌ షిప్‌ లో సీనియర్స్‌ విభాగంలో సింగిల్స్‌ లో బ్రాంజ్‌ మెడల్‌, డబుల్స్‌ లో రజత (సిల్వర్‌)పతకం సాధించాడని వివరించారు. 42దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో సింగిల్స్‌ విభాగంలో మూడవ స్థానం సాధించాడని, రాజస్థాన్‌ క్రీడాకారునితో కల్సి ఆడిన డబుల్స్‌ లో రెండవ స్థానం లభించిందని ఆయన చెప్పారు. బెంగుళూరులో నాలుగేళ్లు ఆడాడని, అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంతో స్పెయిన్‌ లో శిక్షణ పొందిన శివాజీ..గ్రీస్‌లో గత నెల 23 నుంచి 29 వరకు జరిగిన పోటీల్లో రెండు పతకాలు సాధించాడని చెప్పారు. శివాజీ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలతో జీవితం మొదలైందని తెలిపారు.మొదటిసారి ఆరోఏటా శివాజీకి చెవిటి తనం ఉన్నట్లు గుర్తించామన్నారు.ఆనాడే చదువు కన్నా క్రీడల్లో తర్ఫీదు ఇస్తే ఉన్నత స్థాయికి చేరతాడని భావించానన్నారు.అంతేకాదు టీం ఈవెంట్స్‌లో అనగా ఎక్కువ మంది పాల్గొనే పుట్‌బాల్‌, క్రికెట్‌ కన్నా..వ్యక్తిగత ప్రతిభ ఎక్కువగా బయటకు వచ్చే  సింగిల్‌ ఈవెంట్స్‌ అనగా టెన్నీస్‌, చదరంగం,బ్యాడ్మింటన్‌,ఆర్చరీ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నా రు. ఆనాడే నేను  ప్రతీరోజూ ఆడే టెన్నీస్‌లోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తండ్రి పిల్లా బాల చెప్పారు. మొదటిసారి అర్జున రాయుడు,బషీర్‌ బాబా అనే కోచ్‌ల వద్ద చేర్పించి రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజ్‌లో టెన్నీస్‌లో మెలకువలు నేర్పించానన్నారు.తన కుమారుడు మొదట్లో దేశంలో ఆడుతున్న సాధారణ టెన్నీస్‌ క్రీడాకారులతో పోటీ పడుతూ..ఎన్నో మ్యాచ్‌ల్లో ప్రతిభ ప్రదర్శించి దేశవ్యాప్తంగా జరిగిన జాతీయ స్థాయి టెన్నీస్‌ పోటీల్లో అండర్‌ `18లో 160 వ ర్యాంకు సంపాదించాడని వివరించారు.ఇప్పుడు చెవిటితనం(డెప్‌) క్రీడాకారుల్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్నాడన్నారు.ఎన్నో ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్నా..వైద్యులు మోకాలికి ఆపరేషన్‌ తప్పనిసరి అని చెప్పినా అన్నీ అధిగమించి గ్రీస్‌వెళ్లిన తన కుమారుడు శివాజీ బాగా ఆడి ఇండియాకు పతకం గెలుస్తానని తనకు ధైర్యం చెప్పి వెళ్లాడని తెలిపారు.నా కుమారుడు  గ్రీస్‌లో వరల్డ్‌ డెప్‌ టెన్నీస్‌ చాంపియన్‌ షిప్‌లో రెండు పతకాలు మెడల్స్‌ సాధించి నా మాతృదేశానికి పేరు తెచ్చినందుకు తండ్రిగా ఎంతో గర్వపడు తున్నానని అన్నారు.పెండెం రామాజీ,మల్లిఖార్జున రావులు మాట్లాడుతూఈనెల 9వ తేదీన నగరానికి వస్తున్నందున మధురపూడి విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా దానవాయిపేటలోని  ఇంటికి తీసుకొస్తామని చెప్పారు. కెమిస్ట్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌  పెండెం రామాజీ, సిహెచ్‌ మల్లికార్జునరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

క్రికెట్ లైవ్ కామెంట్రీలో గ్రామీణ ప్రాంత విద్యార్థి సత్తా..!!

వైసీపీ నాయకుల అవినీతిని చెత్త ఊడ్చినట్టు ఊడ్చి ఎండగడతాం