in ,

వైసీపీ నాయకుల అవినీతిని చెత్త ఊడ్చినట్టు ఊడ్చి ఎండగడతాం

రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ అరాచక,అక్రమాలను చెత్త ఊడ్చినట్టు ఊడ్చి వారిని ఎండగడతామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు అక్రమ  నిరసనగా నేడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు స్థానిక డీలక్స్ సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు రోడ్డు మీద పేరుకుపోయిన చెత్తను ఉడుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా పేరుకుపోయిన వైకాపా ప్రభుత్వ నాయకులను,  వారి అవినీతిని రోడ్డు మీద చెత్త ఊడ్చినట్టు ఊడ్చి బయట పారేస్తామని,రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ధమనకాండ నుండి ప్రజలను కాపాడవలసిన అవసరం ఉందని,దానికోసమే చంద్రబాబు నాయుడు,లోకేష్ ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో ఉండగా ఈ ముఖ్యమంత్రి జగన్ తన అధికారాన్ని ఎక్కడ కోల్పోతానని భయంతో ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గోరంట్ల మండిపడ్డారు.

 రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని , పోలీస్ వ్యవస్థను  జగన్ తనకి అనుగుణంగా వారిని ఉపయోగించుకుంటున్నారని, అర్ధరాత్రి దొంగల్లా వచ్చి టీడీపీ నాయకులు అరెస్టు చేయడం  వారికి అలవాటుగా మారిందని,అధికారంలో ఉండి పోలీసులు పరదాలు చాటున  తిరిగే ముఖ్యమంత్రి జగన్ అని,  అధికారంలో లేనప్పటికీ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిపై పోరాడే నాయకుడు చంద్రబాబు అని, జగన్ తన మీటింగులకు స్కూలుకు కాలేజీలకు, సెలవులు ప్రకటించి ,ఆశా వర్కర్లను వాలంటరీలను,బలవంతంగా తన మీటింగ్ కు తీసుకెళ్తున్నారని గోరంట్ల ఏద్దేవా చేశారు.

వైకాపా ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు అంతమయ్యే రోజు త్వరలోనే ఉందని, అవకాశం కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో జగన్‌ పార్టీకి దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వనున్నారని ధీమా వ్యక్తం చేశారు.ఎన్ని కుట్రలు చేసిన చంద్రబాబు నిర్దోషిగా విడుదల అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు.అక్రమంగా అరెస్టులు చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైకాపాను గద్దె దింపే వరకూ పోరాటం ఆగదని గోరంట్ల ధీమా వ్యక్తం చేశారు.

 ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్,గంగిన హనుమంతరావు,పండూరి అప్పారావు,ఆళ్ల ఆనందరావు,చెల్లుబోయిన శ్రీనివాస్,మజ్జి పద్మావతి,దండమూడి ప్రసాద్, బొప్పన నానాజీ,నున్న సూరిబాబు,కంటిపూడి బాబీ, సింగ్ సురేంద్ర,బూర దుర్గా ఆంజినేయులు,గోందేసి మాధవి లత,రొంపిచర్ల ఆంటోనీ దాస్,పిల్లా తనూజ,బండి నాగమణి,ముత్తాబత్తుల విజయ, దండమూడి ప్రమీల,కోటిపల్లి అమ్ములు,పేట వీరలక్ష్మి,మద్ద మణి,కంచెర్ల లక్ష్మి,కత్తుల పద్మ తదితరులు పాల్గొన్నారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

టెన్నిస్ క్రీడాకారుడు శివాజీ 9న రాజమండ్రికి రాక

పలు అభివృద్ధి కార్యక్రమలకి శంకుస్థాపనా చేసిన కేకే రాజు