కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి లో సోమవారం విద్యుత్ భద్రతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ వెంకటరావు ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ భద్రతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏఈ మాట్లాడుతూ…విధి నిర్వహణలో భాగంగా తోటి ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తూ, విద్యుత్ భద్రతా పాటించాలని సూచించారు. అలాగే కార్యాలయం ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!