గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఇప్పటికే ఆయన కలలుగన్న గ్రామస్వరాజ్యం దిశగా జగనన్న పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పాడేరు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే గారు ఘన నివాళులర్పించారు. అనంతరం భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో గాంధీ గారు పోషించిన పాత్ర చాలా గొప్పదని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్య ఆశయం ఆచరణలోకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఏర్పాటు అవుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాఠశాల నిర్మాణం ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు అన్నారు. గాంధీ ఆశయ సాధనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చారని చెప్పారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను పక్క రాష్ట్రాల వారు కూడా అమలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఇవి ఏ మాదిరిగా ఉత్తమ పథకాలు ఆలోచన చేయాలన్నారు. పాలనా విధానంలోనే సమూల మార్పులను తీసుకొచ్చి ప్రజలకు చేరువు చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన బడుగు, బలహీన వర్గాల వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ అవకాశాలు కల్పించాలని అంశాన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నటువంటి దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు అని తెలిపారు. నాడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో గాం మల్లుదొర, గాంగంటందొర, పండుపడాల్, వీరన్నపడాల్ తదితరులంతా ఏ మాదిరి పోరాటం చేశారో ఆ మాదిరిగానే ఈరోజు గిరిజన ప్రాంతంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో గాని వారి అవసరాలను తీర్చే విషయంలో గానీ అంతగా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు… ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు ఏఎంసీ చైర్మన్ కూతంగి సూరిబాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు వనుగు బసవన్న దొర, మండల పార్టీ ఉపాధ్యక్షులు పసుపుల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ జి.మాడుగుల కుడుముల సత్యనారాయణ, ఎంపీటీసీలు సల్లా చిట్టెమ్మ, లకే రామకృష్ణ పాత్రుడు, కుంతూరు సత్యనారాయణ, సర్పంచులు వంతాల రాంబాబు, గొల్లూరి నీలకంఠం, లకే పార్వతమ్మ, గల్లేలి లింగమూర్తి, జిల్లా పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి సిరగం దశమూర్తి, సచివాలయ కన్వీనర్లు వంతాల నరేష్, కోడ సుశీల, మాదేల ప్రసాద్ , లకే సత్యవతి, గొల్లోరి ఈశ్వరరావు, మినుముల కన్నాపాత్రుడు, సీనియర్ నాయకులు మోద బాబురావు, జర్సింగి సూర్యనారాయణ, కొండపల్లి సాయి, సెగ్గె పోతురాజు , శివరాత్రి నాగేశ్వరరావు, రొబ్బా శంకర్రావు తదితరులు పాల్గొన్నారు..
This post was created with our nice and easy submission form. Create your post!