తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ గాంధీజీ కి నివాళి అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అహింస మార్గంలో సత్యాగ్రహం పోరాటం చేసి గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం సాధించారని కొనియాడారు. నేటి యువత కూడా గాంధీజీ ఆదర్శం గా తీసుకుని ఆయన మార్గంలో పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!