అల్లూరి సీతారామరాజు జిల్లా లోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరు గాంచిన చాపరాయి జలపాతానికి సోమవారం పర్యాటకులు పోటెత్తారు. సహజంగా శని, ఆదివారాల్లో అరుకు అందాలు చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే సోమవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో చాపరాయి జలపాతంలో పాటు అరుకులోయ లోని గిరిజన మ్యూజియం, పద్మపురాణం గార్డెన్స్, కంటికి జలపాతం, బొర్రా గుహలు, గఆలఇకఒండ వ్యూ పాయింట్ పర్యాటకులతో కిటకిటలాడాయి.
This post was created with our nice and easy submission form. Create your post!