అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్ళపూడి లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని మండలం ఏఎస్ వో జోడాల వెంకట్ కోరారు. ఈ మేరకు రక్తదాన శిబిరం కరపత్రాలను ప్రముఖ పారిశ్రామికవేత్త సింహాద్రి జనార్ధన్ రావు చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనేది సమయంలో కాపాడేది రక్తమే అన్నారు. 18 నుంచి 50 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!