సిద్ధిపేట:
రాబోయేఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం సిద్ధిపేట జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం సిద్దిపేటలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నుండి ఎంతమంది కొవర్టులు వెళ్లిన పార్టీకి నష్టమేమీ లేదని అన్నారు. పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారని వారిని త్వరలోనే బయటికి పంపిస్తామని అన్నారు. ఇలాంటి వారి పట్ల ఏ పార్టీలోకి వెళ్లిన వారికి సముచిత స్థానం ఉండదని అన్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇలాంటి నాయకుల గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు పథకాలపై గడప గడపకు వెళ్లి మహిళలకు వివరించాలని అన్నారు. అందులో ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నాయకురాలు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్రవంతి రజిని నరసవ్వ లక్ష్మీ రజిత తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!
