in ,

దొరల గుండెల్లో బడబాగ్ని రగిలించిన వీరవనిత చాకలి ఐలమ్మ

ఘనంగా చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకలు

నారాయణవరపు, శ్రీనివాస్ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు

దౌర్జన్యాలకు, అణచివేతకు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సమర శంఖం పూరించి ఆనాటి దొరల గుండెల్లో బడబాగ్ని రగిలించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ధుస్సా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సత్తుపల్లి మెయిన్ రోడ్ బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా జరిగిన 128వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివళులర్పించారు. అనంతరం కార్యక్రమానీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే తొలి ఉద్యమ కారిణిగా ఆనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో సువర్ణ అక్షరాలతో లిక్కించబడ్డాతాయని అన్నారు.  బానిస బ్రతుకులు మనకొద్దు అని నిజాం పాలన అంతం కోసం ఎర్ర జెండాని భుజానికి ఎత్తి పిడికిలి బిగించి సివంగిలా గర్జించిన గొప్ప ఉద్యమకారిణి అని అన్నారు. ఇవి మనం చెప్పే మాటలు కావు అని చరిత్ర చెబుతున్న నిజాలు సాక్షాత్తూ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారని తెలిపారు. చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి తోనే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని పేర్కొన్నారు. అదేవిధంగా (బి.ఎస్. పి) పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్. ప్రవీణ్ కుమార్ చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితోనే బహుజన రాజ్యాధికార సాధన ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్నామని, కిషన్ రెడ్డి కావచ్చు, అనేక రాజకీయ పార్టీల నాయకులు ఐలమ్మ ఉద్యమాన్ని, ఆమె పోరాటాన్ని స్మరించుకోవటం గర్వకారణం అన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు చాకలి ఐలమ్మ యొక్క చరిత్రని అడ్డుపెట్టుకొని, ఆ సామాజికవర్గానికి చెందిన ఓట్లు దండుకునే ఆటువంటి ప్రయత్నమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక కులస్తులు యొక్క ఆర్థిక, విద్య, ఉద్యోగ రాజకీయ, అన్ని రంగాల్లో వారి స్థితిగతులపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి అధ్యయనం చేయాల్సిన ఆటువంటి అవసరం ఉంది అన్నారు. మా సోదరా కులాలు అయినటువంటి ఎస్సీ, ఎస్టీల కన్నా అన్ని రంగాల్లో వెనుకబడి నటువంటి కులం రజక సామాజిక వర్గం అని, అటువంటి సామాజికవర్గానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక, సామాజిక పురోగతిని సాధించే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. ఈ రోజు చాకలి ఐలమ్మ యొక్క వారసులుగా మనమందరం సంఘటితంగా ఉండి బీసీ హక్కులను సాధించుకోవాలని, బీసీలుగా ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ, ఎవరు ఏ వర్గంలో ఉన్నప్పటికీ మనందరి ఏజెండా మాత్రం రాజ్యాధికారమే కావాలని ఆయన అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6శాతం లేనోళ్లకు ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఆరుగురు ఎమ్మెల్యేలు కావాలి, 4మంత్రులు కావాలి, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 26లక్షల మంది రజకుల ఉన్నప్పటికీ ఒక్క ఎమ్మెల్యే ఉండడు ఒక్క ఎంపీ ఉండడు అన్నారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు, ముదిరాజులు, ఇలా అనేకమైనటువంటి బీసీ కులాలకు చెందిన వారికి అసెంబ్లీలో స్థానం లేదని, చివరికి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవాళ బీసీలుగా మనం పనికి రావట్లేదని, ఇటీవలనే BRS పార్టీ 119 అసెంబ్లీ స్థానాలని ప్రకటించగా అందులో 56% ఉన్న బీసీలకు కేవలం 23 స్థానాలు మాత్రమే కల్పించడం బీసీల నాయకత్వాన్ని అణిచివేయటంలో భాగమేనని ఆయన అన్నారు.‌ ఈరోజు మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ఆయా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో మన వాటాను మనం దక్కించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ధోబి ఘాట్ వద్ద రజక సంఘం నాయకులు వీరివాడ నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంతో పాటు బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ లో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు చిల్లపల్లి మాధవరావు, సత్తుపల్లి మండల అధ్యక్షులు పామర్తి నాగేశ్వరరావు, జిల్లా ఉపధ్యక్షుడు మల్లెలి శ్రీను, యువజన విభాగం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు మరీదు ప్రసాద్, జిల్లా కార్యదర్శి గుడిధ రామకృష్ణ, రజక సంఘం నాయకులు బలుసుపాటి ధను, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తిన్నవల్లి రంగారావు, నియోజవర్గ గౌరవ సలహాదారులు చిల్లగుండ్ల వెంకటేశ్వరరావు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పాపారావు, కోట సత్యనారాయణ, టోపీ శ్రీను, వల్లూరి శ్రీను, మారేశ్వరరావు, విద్యార్థి సంఘం నాయకులు దర్మతేజతో పాటుగా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

రాష్ట్రపతి ని కలిసిన లోకేష్

కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు తథ్యం