-విజ్ఞాన కేంద్రం గా సూర్యాపేట సమీకృత గ్రీన్ మార్కెట్
-ప్రత్యేకత ను తెలుసుకునేందుకు హైదరాబాద్ నుండి సూర్యాపేట కు క్యూ కడుతున్న విద్యార్ధులు
-జాతీయస్థాయి ప్రమాణాలతో సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ గ్రీన్ మార్కెట్ నిర్మాణం
– మార్కెట్ లో దశ దిశల గాలి వెలుతురు
– 30 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల్లో ఈ మార్కెట్ నిర్మాణం
-గైడ్ గా మారి మార్కెట్ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించిన మంత్రి జగదీష్ రెడ్డి
-మంత్రి మేధస్సు కు , చొరవ కు ఫిదా అయిన విద్యార్ధులు
– హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల విద్యార్థులకు వివరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
– ఆసియాలో అతిపెద్ద కోయంబత్తూర్ మార్కెట్ ను తలదన్నేలా ఉందంటూ విద్యార్థుల కితాబు
– ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మినీ టాంక్ బండ్ పరిసరాలను చూస్తుంటే హైదరాబాదులో ఉన్నట్టే ఉందన్న విద్యార్థులు
– ఈ పర్యటనలో మంత్రి జగదీష్ రెడ్డి తెలిపిన వివరాలు మాకు విద్యాపరంగా ఎంతో తోడ్పడుతాయని ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థులు.
సూర్యాపేట సెప్టెంబర్ 22:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం, మంత్రి జగదీష్ రెడ్డి ఆలోచనల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విజ్ఞానకేంద్రంగా మారింది. రాజధానితోపాటు రాష్ట్ర నలుమూలల నుండి విద్యాసంస్థలు మార్కెట్ ప్రత్యేకతలు తెలియజేయడానికి విద్యార్థులను తీసుకొస్తున్నాయి. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిసరాలు విద్యార్థుల కోలాహలంతో టూరిస్ట్ స్పాట్ ను తలపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో 30 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల్లో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మించడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ట్యాంక్ బండ్, మహాప్రస్థానం ను ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా సందర్శించేందుకు వచ్చిన హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వారిని కలుసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో ఇంత పెద్ద మార్కెట్ మేము గతంలో ఎప్పుడు చూడలేదని ఇక్కడే చూస్తున్నామని ఇది ఎలా నిర్మించారని అడిగి తెలుసుకున్నారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి మార్కెట్ నిర్మాణం దాని ప్రత్యేకతలను విద్యార్థిని విద్యార్థులకు సవివరంగా వివరించారు. జర్మన్ టెక్నాలజీతో 10 ఎంఎం మందం యువి ఆల్ట్రా వైలెట్ ఫిల్టర్ డుమ్ స్కైలాట్ గా ఏర్పాటు చేశామని దీంతో సన్లైట్ పైప్స్ ప్రత్యేక లెజర్ బ్లో పైప్ ద్వారా ప్రతి దుకాణంలో రోజుకు 9 నుంచి 10 గంటల పాటు పగటి వెలుగులు ఉంటాయని తెలిపారు. ఇది దేశంలో మొదటి మొట్టమొదటిసారిగా ఈ మార్కెట్ లోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్కైలేట్ వల్ల విద్యుత్ దీపాలతో పని లేకుండా సహజ కాంతి పడేలా డిజైన్ చేసి నిర్మించడంతో మొత్తం మార్కెట్ యార్డు భవనాల్లో విద్యుత్ దీపాల అవసరం ఉండదన్నారు. ఒక్క యూనిట్ కరెంటు కూడా వెలుతురు కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అదే ఈ మార్కెట్ ప్రత్యేకత అన్నారు. అలాగే ఆరు ఎయిర్ వెంటిలేటర్ బ్లోయర్స్ తో నిమిషానికి 26 సార్లు లోపలి గారిని ఫిల్టర్ చేసి బయటకు పంపేలా ఎయిర్ వెంటిలేషన్ సిస్టం ఏర్పాటు చేశామని దీంతో దుకాణాల్లో ఎప్పుడు 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో విద్యుత్ వాడకం తక్కువగా ఉంటుందని వివరించారు.
కోయంబత్తూర్ మార్కెట్ ను తలదన్నేలా ఈ మార్కెట్ నిర్మాణం ఉంది
ఆసియాలో అతిపెద్ద మార్కెట్ కోయంబత్తూర్ మార్కెట్ అని దాన్ని తలదాన్నెలా మార్కెట్ నిర్మాణం చేయడం జరిగిందని విద్యార్థిని విద్యార్థులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సూర్యాపేటలో ఇంత పెద్ద మార్కెట్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో తాము చేసిన పర్యటన విద్యాపరంగా మాకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం దాని ప్రత్యేకతలను మంత్రి జగదీష్ వివరించిన తీరు మాకు బాగా నచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మార్కెట్ ద్వారా తాము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని జగదీష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి, మార్కెట్ సెక్రటరీ ఎండి ఫసియోద్దీన్, మున్సిపల్ కమిషనర్ పి రామానుజుల రెడ్డి, లిటిల్ ఫ్లవర్ హైదరాబాద్ కళాశాల అధ్యాపకులు నాగార్జున కుమార్, రాజశేఖర్, వాని, వాసవి, వరుణ్, వేణులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!