కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా నేతృత్వంలో జేడీఎస్ నేత కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించి వివరాలు మాత్రం వెల్లడించలేదు. తాజా చేరికతో గత కొంత కాలంగా బీజేపీ-జేడీఎస్‌ల మధ్య పొత్తులపై ఉహాగానాలకు తెరపడినట్లైంది.