in , ,

ప్రభుదేవా ఇంట్లో విషాదం.. హుటా హుటిన చేరుకున్న సోదరులు

ప్రభుదేవా ఇంట్లో విషాదం.. హుటా హుటిన చేరుకున్న సోదరులు

Prabhu Deva.. ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. ప్రముఖ సింగర్ ఉషా ఉతప్ భర్త గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే.. ఇప్పుడు ప్రముఖ డ్యాన్సర్, నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఇంట్లో విషాదం నెలకొంది.

ఇండస్ట్రీలో ప్రముఖుల ఇళ్లల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతప్ గుండె పోటుతో మరణించారు. ఇప్పుడు మ్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రభుదేవా అమ్మమ్మ పుట్టమ్మని కన్నుమూశారు. ఆమె వయస్సు 97 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో ఆమె మరణించారు. మైసూరులోని మారుమూల ప్రాంతంలో ఆమె జీవిస్తున్నారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రభుదేవా, అతని సోదరులు పాల్గొన్నారు. అమ్మమను కడసారి చూసేందుకు ప్రభుదేవాతో పాటు అతడి అన్నాదమ్ములు చెన్నై నుంచి మైసూరు చేరుకున్నారు. మైసూరు మందకల్లి విమానాశ్రయానికి చేరుకున్న ప్రభుదేవా సోదరులు కారులో ధుర అనే మారుమూల గ్రామానికి చేరుకున్నారు

పుట్టమ్మని ప్రభుదేవా తల్లి మహాదేవమ్మకు అమ్మ, సుందర్ మాస్టర్‌కు అత్త అవుతారు. తెలుగులో ఆయనను సుందరం మాస్టారు అని పిలుస్తుంటారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందర్ మాస్టర్ వాస్తవానికి కర్ణాటక వాసి. ఆయన మైసూర్‌లోని టి.నరసీపూర్ తాలూకాలోని ముగూరులో జన్మించారు. ధుర గ్రామ మాజీ ఉపాధ్యక్షుడు మహదేవప్ప, పుట్టమ్మని కుమర్తె మహాదేవమ్మతో సుందర్ మాస్టర్ వివాహం జరిగింది. తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సుందర్ మాస్టర్.. కొరియోగ్రాఫర్‌గా రాణించారు. దీంతో ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. సుందరం మాస్టారుకు ముగ్గురు కొడుకులు. రాజు సుందరం, ప్రభు దేవా, నాగేంద్ర ప్రసాద్. ఈ ముగ్గురు కూడా యాక్టర్లుగా, కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు.

సుందరం మాస్టారు వారసత్వాన్ని తీసుకున్న ఈ ముగ్గురు ఇండస్ట్రీల్లో కొరియోగ్రాఫర్లుగా ఎంట్రీ ఇచ్చి…ఆ తర్వాత నటులుగా కూడా యాక్ట్ చేశారు. వీరిలో ప్రభుదేవా మరింత ఫేమస్ అయ్యారు. ఆయనకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ అన్న పేరు ఉంది. ఇందు అనే తమిళ మూవీతో హీరోగా మారిన ప్రభుదేవా.. ప్రేమికుడు మూవీతో స్టార్ హీరో అయ్యారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం చిత్రాల్లో హీరోగా రాణించారు. దర్శకుడిగా తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలను తెరకెక్కించాడు. తమిళంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాక.. బాలీవుడ్ బాట పట్టిన ప్రభుదేవా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటు నటుడిగా రాణిస్తున్నాడు. రాధే మూవీ తర్వాత దర్శకత్వానికి కాస్త దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం యాక్టర్‌గా కొనసాగుతున్నాడు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ట్రైనింగ్ డిఎస్పి ధీరజ

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్