in , , ,

ఐటీ హబ్ గా సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి

  • సూర్యాపేట సిగలో మరో మణిహారం.

  • సూర్యాపేట కు  రానున్న ఐటీ సొబగులు

  • ఈ నెలలో  ప్రారంభోత్సవానికి  కొనసాగుతున్న ఏర్పాట్లు

  • ఐటి హబ్ గా అవతరించనున్న  పాత కలెక్టరేట్ భవనం

  • జూమ్ మీటింగ్ ద్వారా సూర్యాపేట లో IT TOWER ఏర్పాటు గురించి అమెరికా లోని ఆయా ఐటీ కంపెనీ ప్రతినిధులు

రాజ్ సంగాని ,శశి దేవిరెడ్డి ,సందీప్ రెడ్డి కట్టా ,ఫణి పాలేటి ,ప్రియా రాజ్  విజయ్ దండ్యాల ,అభిషేక్ బోయినపల్లి  మరియు తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈఓ విజయ్ రంగినేని ,టాస్క్ కో -ఆర్డినేటర్ ప్రదీప్ లతో మీటింగ్ నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డి.

  • హైదరాబాద్

సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరిపాలన దక్షతతో అన్ని రంగాలలో అభివృద్ధి పరంగా దూసుకు పోతున్న సూర్యాపేట సిగలో మరో మణిహారం రానుంది.

స్థానిక యువత ఎప్పుడు ఎపుడా అని ఎదురు చూస్తున్న.. సూర్యాపేటకు  త్వరలో ఐటీ సొబగులు రానున్నాయి.. పాత కలెక్టర్ కార్యాలయంలో ఐటి టవర్ ను రానున్న వారం పది రోజుల్లో ఏర్పాటు చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వం లోని అధికార అధికార యంత్రాంగం  నిర్ణయించింది..ఈ మేరకు ఈ రోజు పలు  అమెరికన్ ఐటీ కంపెనీల ప్రతినిదులతో మంత్రి జగదీశ్ రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల కు వారధిగా ఉన్న సూర్యాపేటలో త్వరలో ఐటీ టవర్  ప్రారంభోత్సవానికి   ఏర్పాట్లు  చేయాలని అధికార యంత్రం గాని మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు

[zombify_post]

Report

What do you think?

కార్గో సేవలు ఉపయోగించుకోండి

ఏకకాలంలో పైడితల్లి పండగ, విజయనగరం ఉత్సవాలు”