in , , , ,

ఉపాధ్యాయ కొలువులు.. మహిళలకే..!

  • ఉపాధ్యాయ కొలువులు.. మహిళలకే..!

  • రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించనున్న టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టిఆర్టీ)లోని పోస్టులు మహిళలకు భారీ సంఖ్యలో దక్కనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించనున్న టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టిఆర్టీ) లోని పోస్టులు మహిళలకు భారీ సంఖ్యలో దక్కనున్నాయి. వారికి 33% రిజర్వేషన్ ఉండటంతో పాటు తొలిసారిగా కొత్త జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను రూపొందించడం.. చాలా చోట్ల మహిళా రోస్టర్ మేరకే పోస్టులు ఉండడం తదితర కారణాలతో ఏకంగా 51 శాతానికి పైగా ఉద్యోగాలు వారికి కేటాయించారు. 

ఉదాహరణకు జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకారం మొదటి పోస్ట్ ఓసి మహిళకు, రెండో పోస్టు ఎస్సీ మహిళలకు వెళుతుంది. ఒకవేళ ఇప్పుడు అక్కడ రెండు పోస్టులే ఉంటే ఆ రెండు మహిళకే దక్కుతాయి. తదుపరి రిక్రూట్మెంట్లో మరో రెండు పోస్టులు భర్తీ చేయదలిస్తే మూడో రోస్టర్ నుంచి లెక్క మొదలవుతుంది. ఇప్పుడు మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి టిఆర్టి నిర్వహించినున్న విషయం తెలిసిందే .ఈ నెల 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం జిల్లాల వారీగా, సామాజిక వర్గాలు, పురుషులు మహిళల వారీగా పోస్టులు ఖరారు చేసి వాటిని పాఠశాల విద్యాశాఖ తన వెబ్సైట్లో ఉంచింది. ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తక్కువ ఉన్న జిల్లాలో మహిళలకు ఎక్కువ పోస్టులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 2598 మహిళలకు, 2491 పురుషులకు దక్కనున్నాయి.

జనరల్ విభాగంలోనూ పురుషులతో మహిళలు పోటీ పడతారు. ఫలితంగా 55 నుండి 60 శాతం ఉద్యోగాలు వారి సొంతం చేసుకోనున్నారు. అదిలాబాద్ జిల్లాలో 275 ఖాళీల్లో 135, నల్లగొండలో 219 లో 104, భువనగిరిలో 99 కి 55, కరీంనగర్లో 99 లో 44, జనగామలో 76కు 42, హనుమకొండలో 54 లో 35, పెద్దపల్లిలో 43 లో 32 ఉద్యోగాలు మహిళలకు దక్కనున్నాయి. ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వర్టికల్ పద్ధతిలోనే రోస్టర్ ఉంటుందని, ఎంపిక నాటికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వర్టికలా, హారిజాంటల్  విధానమా అన్నది స్పష్టం అవుతుందని చెబుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు మ‌హిళా న‌క్స‌ల్స్ హ‌తం

విశాఖ ఉక్కు రక్షణకై సీపీఎం బైక్ ర్యాలీ