రాజమహేంద్రవరం: జిల్లాలో డోమెస్టిక్(గృహ) సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి (ఇంచార్జ్) కె కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీ కె కుమార్ గారు గారి ఆద్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలోని మోరంపూడిలో డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు వినియోగం పై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలోని మోరంపూడిలోని చైతన్య నగర్లో గల శ్రీ దుర్గా దేవి ఫుడ్ పాయింట్ హోటల్ నందు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుచున్నారన్న సమాచారం మేరకు తనిఖీ చేయగా సదరు హోటల్ నందు 06 డోమెస్టిక్(గృహ) సిలిండర్లును గుర్తించటమైనది.
సదరు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుట కారణముగా MSO, రాజమహేంద్రవరం(అర్బన్) వారు సదరు 06 డోమెస్టిక్(గృహ) సిలిండర్లును స్వాధినపర్చుకొని కేసు నమోదు చేశారు.
ఈ తనిఖిలలో కార్యాలయ సబ్-ఇన్స్పెక్టర్ జగనాధరెడ్డి, జియాలిజిస్ట్ లక్ష్మినారాయణ, హెడ్ కానిస్టేబుల్ జీవానందం, కానిస్టేబుల్ లోవకుమార్ మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు.
[zombify_post]