అక్రమాలకు చెక్ పడేనా?
ఉపాధి పనుల్లో వేతనదారులు (ఫైల్)
దాని ఆధారంగానే కూలీలకువేతనాల
ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఇకపై ఆధార్ లింక్‌తోనే వేతనాలు చెల్లించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఉపాధి’లో అక్రమాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈనెల నుంచే దీనిని అమలు చేయాలని భావించినా క్షేత్రస్థాయిలో అనుసంధానం ఆలస్యం కావడంతో వాయిదా పడింది. పూర్తిస్థాయిలో వేతనదారుల వివరాలను పొందుపర్చిన తర్వాత వచ్చే ఏడాది జనవరి నుంచి ఆధార్‌తోనే ఉపాధి వేతనాలు చెల్లించేలా ముమ్మర చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలోని 15 మండలాల్లో 3,55,028 మంది వేతనదారులు ఉన్నారు. వీరందరికీ ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల ఆధారంగానే వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే నూతన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనుసంధానం కాని ఖాతాలకు వేతనాలు చెల్లింపులు జరగవని సూచించారు. దీంతో వేతనదారుల జాబ్‌కార్డులను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసే ప్రక్రియ చురుగ్గా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 3,44,731 మందికి బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం పూర్తయింది. వేతనదారునికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఆధార్ అనుసంధానం ప్రక్రియ గడువును డిసెంబరు 31 వరకు పొడిగించారు.

ఎన్‌పీసీఐ మ్యాపింగ్ తప్పనిసరి
వేతనదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మ్యాపింగ్ తప్పనిసరిగా జరగాలి. అయితే ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,44,731 మంది ఖాతాలకు మ్యాపింగ్ జరిగింది. పలు మండలాల్లో 3,141 మందికి సంబంధించి అఽథంటికేషన్ ఫెయిలయ్యాయి. పలు కారణాలతో ఫెయిలైన ఖాతాలను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో 61 మందికి సంబంధించి ఆధార్‌కార్డులు లేవు. వేలి ముద్రలు పడకపోవడం, పేర్లులో తేడాలు, మార్పులు వంటి పలు కారణాలతో ఖాతాలను అనుసంధానం కాలేదు. డిసెంబరు నెలాఖరులోగా పూర్తిస్థాయిలో అనుసంధానానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
– గతంలో ఉపాధి హామీ పథకంలో పలు అక్రమాలు జరిగాయి. పోస్టాఫీసులో ఖాతాలు నిర్వహించే సమయంలో సిబ్బందికి సగం, వేతనదారునికి సగం అన్న చందంగా ఉండేది. పనులకు వెళ్లకుండానే మస్తర్లలో హాజరుతో పాటు సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బంది చేతుల్లో అధికంగా పోస్టల్ ఖాతాలు ఉండేవి. తెలియని వేతనదారులతో సంతకాలు చేయించి పోస్టల్ , ఉపాధి సిబ్బంది కుమ్మకై నిధులు దుర్వినియోగం చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకే కేంద్ర సర్కార్ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత విధానంతో వేతనదారునికి నేరుగా నగదు అందనుంది. అయితే కొంతమంది సిబ్బందికి ఇది మింగుడుపడడం లేదు. పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ జరిగితే జనవరి నుంచి ఆధార్ అనుసంధా నంతోనే వేతనాలు అందే అవకాశాలు ఉన్నాయి.
శత శాతం పూర్తికి చర్యలు
జిల్లా పరిధిలోని 15 మండలాల్లో ఆధార్ అనుసంధానం ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 99 శాతానికి పైగా ఆధార్‌కార్డులకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ జరిగింది. అనుసంధానానికి గడువు పెంచిన దృష్ట్యా శత శాతం పూర్తికి చర్యలు చేపడతాం. ఈ మేరకు మండల స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. జిల్లా పరిధిలో 3,55,028 మంది వేతనదారులు ఉండగా, 3,54,967 మందికి ఆధార్ అనుసంధానం జరిగింది. ఇందులో 3,51,822 మంది వివరాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. మొత్తంగా మ్యాపింగ్ అయిన వారు 3,44,731 మంది వేతనదారులు ఉన్నారు.
కె.రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం జిల్ల
[zombify_post]