కరీంనగర్ జిల్లా:
*అభివృద్ధి నిరంతర ప్రక్రియ*
*ప్రపంచ పర్యాటకం ఆకర్షించేలా నగర అభివృద్ధి*
*కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నా*
*మరోసారి ఆశీర్వదిస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా*
*రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్*
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని..నమ్మి ఓటు వేసిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని..మరోసారి అవకాశం ఇస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని స్థానిక విద్యానగర్ లో కొత్త యస్వాడ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…తెలంగాణ రాక ముందు నగరం ఏ విధంగా ఉండేది..ప్రస్తుతం ఏ విధంగా ఉందో ఆలోచించాలని అన్నారు. పాలకులు మారినా 40 ఏళ్లలో అభివృద్ధి చేయాలనే ఆలోచన రాలేదని అన్నారు. ఆనాడు తాను పాదయాత్ర చేసిన నాడు ఇచ్చిన మాట ప్రకారం రహదారుల అభివృద్ధి చేయడం జరిగిందని..మిగిలిన రోడ్లు, పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. సమస్యలు లేని నగరం ఉండదని, ఒక్కొక్కటిగా పరిష్కారించుకుంటు వెళ్తున్నామని అన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను నేడు కోట్ల రూపాయల నిధులతో పనులు చేసి నగర రుపు రేఖలు మార్చడం జరిగిందనీ అన్నారు. ప్రపంచ పర్యాటకం ఆకర్షించేలా కరీంనగర్ ను తీర్చిదిద్దుతున్నమని అన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలని, నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, భావితరాలకు గొప్ప నగరాన్ని అందించేందుకు మా చేతులను బలోపేతం చేయాలని కోరారు. ఒక్క ఓటు వేసి ఆశీర్వదిస్తే భవిష్యత్ తరాలకు న్యాయం చేసిన వారవుతారు అని, ఓటు తప్పు చేస్తే నగరం మళ్ళీ అంధకారంలోకి వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ రాజేందర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, నాయకులు కొల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]