హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లేఖ రాసింది. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా బంగారు తెలంగాణ వాగ్దానాన్ని ఢిల్లీ, హైదరాబాద్ లోని ప్రభుత్వాలు మోసం చేశాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులను ప్రైవేటీకరించడం వల్ల ప్రజలకు అందుబాటు ధరలో విద్య, వైద్యం అందకుండా పోతోందని , తెలంగాణ కోసం ప్రజలు పోరాడిన కల నెరవేరలేదని తెలిపింది.