ఈ లీకుల సర్కారు చేసిన అన్యాయానికి ఓటు పోటుతో సమాధానం చెప్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా, త్వరితగతిన ఖాళీలను భర్తీ చేస్తాం. పోటీ పరీక్షల నిర్వహణ చేతకాని కేసీఆర్‌కు, లీకుల సర్కారు చేసిన అన్యాయానికి నిరుద్యోగ యువత ఓటు పోటుతో సమాధానం చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.