గొలుగొండ మండలం లో వినాయక చవితి పర్వదినాన పురస్కరించుకొని
మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని ఎస్ ఐ నారాయణరావు తెలిపారు. ఈ మేరకు మండపాల ఏర్పాటుకు గొలుగొండ పోలీస్ స్టేషన్ లోని దరఖాస్తులు సమర్పిం చాలన్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణంలో నెలకొల్పిన, అసభ్యకర నృత్యాలు ప్రదర్శించిన, కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్ ఐ నారాయణరావు తెలియజేశారు.
[zombify_post]