in ,

వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకోదలచిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ అనుమతి తీసుకోవాలి

అనకాపల్లి. వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని  జిల్లాలో పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహించదలచిన వారు తప్పని సరిగా ముందస్తు పోలీసు అనుమతి పొంది, ఈ క్రింద తెలిపిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించి ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ  ప్రజలకు సూచించారు.
వినాయక "విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు/మండపాలు" ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత  పోలీస్ స్టేషన్ లో ఎస్.హెచ్.ఓ  అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని,
వినాయక "విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి  5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో తెలిపి, వారి గుర్తింపు కార్డు నకలు కాపీలు పోలీస్ వారికి చూపించి అనుమతి పొందవలన్నారు. ప్రైవేట్ లేదా పంచాయతీ/మున్సిపాలిటీ కి సంబంధించిన స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా సదరు ప్రవేటు స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే  పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారి  అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారితోపాటు చుట్టుపక్కల నివసించే వారి సమ్మతి కుడా అవసరమని,
ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు/మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలి. విద్యుత్ వైర్లను మరియు ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి.
విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి. వాహనం నడిపే వ్యక్తి విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
పందిళ్ళు/మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం రెసిడెన్సియల్ ఏరియా నందు పగలు 55, రాత్రి 45 డెసిబల్స్ కు మించకుండా ఉండే విధంగా స్పీకర్లను ఉపయోగించాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి.
భద్రత కొరకు రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండవలెను. ఎవరికి వారు తగు భద్రతా ఏర్పాట్లు చేసుకొనవలెను. రాత్రి సమయాలలో పందిళ్ళు/మండపాలు లో డబ్బులు, బంగారం లాంటి విలువైన వస్తువులు ఉంచరాదు.మండపం వద్ద నిర్వాహకులు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి.
వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు కాని, ప్లెక్సీలు గాని రోడ్డుపైన రాకపోకలకు ఆటంకంగా ఉండకూడదు. వినాయక పందిళ్ళ వలన ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదు.
ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు  చేయరాదు.
ఆ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో గులాలు/రంగులు చల్లడం, లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండు సామాగ్రిని పేల్చడం చేయరాదు.
ఊరేగింపు సమయంలో పోలీస్ వారి అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్దం వచ్చే వాయిద్యాలు అనగా డి.జే. మొదలుగునవి ఉపయోగించరాదు .
పందిళ్ళ వద్ద మరియు నిమజ్జనం ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరుగకుండా  మరియు మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలి. ఈ నిబంధనలను అతిక్రమిస్తే సంబంధిత నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.
నిమజ్జన ఊరేగింపుకు  అనుమతించిన సమయం, నిమజ్జనంకు కేటాయించిన ప్రదేశం మరియు ఊరేగింపునకు కేటాయించిన మార్గము లాంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించవలెను.నిమజ్జనానికి వెళ్లేటప్పుడు చిన్న పిల్లలను తీసుకెళ్లకూడదని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు  పోలీసు వారి విజ్ఞప్తి.

ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు మరియు భద్రత కొరకు తగినంత మంది వాలంటీర్లను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమయంలో మందు గుండు సామాగ్రిని ఉపయోగించరాదు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారుడు మరియు కార్యనిర్వాహకులే బాధ్యత వహించవలసి ఉంటుంది.
పండుగ రోజు నుండి నిమజ్జనం వరకు జరిగే పూజలు, వేడుకల సందర్భాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఉద్దేశంతో ముందస్తు చర్యలలో భాగంగా పై  నియమ నిబంధనలు సూచించామని వాటిని వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే నిర్వాహకులు లేదా కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాటించాలని ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే పూర్తి బాధ్యత నిర్వాహకులు లేదా కమిటీ సభ్యుల పైన ఉంటుందని, కావున వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులే తగిన భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలని ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటే ముందుగానే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరచాలని జిల్లా ఎస్పీ  కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., ప్రజలకు సూచించారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by N.Chiranjeevi

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts
Post Views

మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్న జగన్ : నెక్కంటి

సీతారామ సాగునీటి ప్రాజెక్టులో మిగిలి పోయిన భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందజేయండి.