ఐటీసీ బంధన్ సంస్థ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం లోని ఒంటరి మహిళలకు చేయూతనిచ్చారు.బంధన్ సంస్థ తూరుబాక బ్రాంచ్ వారి సహకారంతో సీతారాంపురం గ్రామంలో బంధన్ ప్రోగ్రాం చేపట్టారు.బంధన్ సంస్థ వారి ఆర్థిక సహాయం తో,కిరాణా షాప్ ,రెడీమేడ్ డ్రెస్ షాప్ .టైలరింగ్ షాప్, నడుపుకునేందుకు తురుబాక నర్సాపురం,దంతేనం,రేగుబల్లి,నడికుడి,గ్రామ పంచాయితిలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 8400 రూపాయలు చొప్పున మొత్తం 2,18,400/-విలువగల సామగ్రిని దుమ్ముగూడెం ఎంపీపీ రేసు లక్ష్మీ గారి చేతులు మీదుగా మహిళలకు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ రేసు లక్ష్మీ మాట్లాడుతూ, ఐటీసీ బంగారు భవిష్యత్ బంధన్ సంస్థ చేస్తున్న ఇటువంటి సేవలు చాలా మంది నిరుపేదల భవిష్యత్ ను మారుస్తాయని, ఆర్ధికంగా ఎదిగేందుకు తోడ్పడతాయని, ఐటీసీ బంధన్ సంస్థ వారికి ధన్యవాదములు తెలిపారు. ఈకార్యక్రంలో దీపక్,తూరుబాక బ్రాంచ్ మేనేజర్,నరసింహులు.ఏరియా కోఆర్డినేటర్ ఉత్తమ్ మరజిత్,దంతేనం సర్పంచ్ పూజారి కృష్ణవేణి.రేగుబల్లి సర్పంచ్ పూజారి,మోహనరావు,రేగుబల్లి ఉపసర్పంచ్ జెట్టి రామకృష్ణ, బ్రాంచ్ స్టాఫర్స్ ఎస్.అన్వేష్,కె.వీరస్వామి.బి.నాగేంద్రబాబు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దామెర్ల శ్రీనివాసరావు,మోతుకూరి శ్రీకాంత్,కణితి భద్రయ్య, వందవాసు రామవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]