సాలూరు: తెదేపా సాలూరు పట్టణాధ్యక్షుడు నిమ్మది తిరుపతిరావు, నాయకులు కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 కొబ్బరికాయలు కొట్టారు.
చంద్రబాబును అరెస్టు చేసి బెదిరిస్తే భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, తెదేపా నెల్లిమర్ల నియోజకవర్గ బాధ్యుడు కర్రోతు బంగార్రాజు, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి అన్నారు. రామతీర్ధం కూడలిలో డెంకాడ మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో వారు పాల్గొన్నారు. రాజకీయ కక్షతో అరెస్టు చేయడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్, మహంతి చిన్నంనాయుడు, కర్రోతు సత్యనారాయణ, కంది చంద్రశేఖర్, పతివాడ అప్పలనారాయణ, లెంక అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి లోకం మాధవి ఆధ్వర్యంలో డెంకాడ మండలంలోని కొండ్రాజుపాలెం హజరత్ తాజుద్దీన్ బాబా ఆశ్రమంలో పూజలు జరిగాయి. 121 కొబ్బరికాయలు కొట్టారు.
[zombify_post]