నూతన వైద్య కళాశాలతో జిల్లావాసులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. పేద విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో పెండింగ్లో ఉన్న పనులు డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. 22 విభాగాల్లో 174 పోస్టులు మంజూరయ్యాయన్నారు. ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజని, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు, కంబాల జోగులు, పుష్పశ్రీవాణి, శంబంగి వెంకట చినప్పలనాయుడు, శ్రీనివాసరావు, బడ్డుకొండఅప్పలనాయుడు, ఎమ్మెల్సీలు రఘురాజు, సురేష్ బాబు, జేసీ మయూర్ అశోక్ పాల్గొన్నారు.
[zombify_post]