అరాచక పాలనకు చరమ గీతం తప్పదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు గురువారం రిలే దీక్షలు చేపట్టారు. కురుపాంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజు, టీడీపీ అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్, ఎంపీపీ సురేష్, టీడీపీ నాయకులు డొంకాడ రామకృష్ణ, శేఖర పాత్రుడు, నంగిరెడ్డి మధుసూధనరావు, ఎంపీపీ సురేష్, నందివాడ కృష్ణబాబు, కేవీ కెండయ్య, బీహెచ్‌వీ రమణకుమార్, కిమిడి రామరాజు, సీహెచ్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
జనసేన కలయికతో హర్షం
[zombify_post]