సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..సైబర్ నేరగాళ్లు ఆశ,భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుంది మరియు భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగుతుంది అదే అదునుగా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి మన బ్యాంకులు, వ్యాలెట్స్ ఇతర వాటి నుండి డబ్బులు సులువుగా దోచేస్తున్నారు కావున మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు.లేదా ఎన్ సి ఆర్ పి పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు.
*రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజులు జరిగిన కొన్ని సైబర్ కేసుల వివరాలు*
● బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు తన ఐసిఐసిఐ బ్యాంక్ ఇష్యూ కోసం గూగుల్ లో ఐసిఐసిఐ కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేశాడు,అది సైబర్ నేరస్తులకి కలిసింది,సైబర్ నేరస్థుడు తాను ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ ని అని చెప్పి విక్టింతో స్క్రీన్ షేరింగ్ యాప్ ఇన్స్టాల్ చేపించి వ్యక్తింకి ఒక పేమెంట్ లింక్ సెండ్ చేశాడు అందులో తన యూపీఐ పిన్ ఎంటర్ చేయడం వలన 2400 /- నష్టపోయాడు.
● సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఇండియన్ బుల్స్ పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ గా సైబర్ నిరసన పరిచయం చేసుకున్నాడు బాధితునికి 10 లక్షల లోన్ శాంక్షన్ అవుతుందని చెప్పి నమ్మించాడు బాధితుడు తన లోన్ శాంక్షన్ కావడం కోసం అప్రూవల్ ప్రాసెసింగ్ మరియు టాక్స్ అని నమ్మించి పలు దఫాలుగా 66,150/- రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.
● రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సప్ లో పార్ట్ టైం జాబ్ అని మెసేజ్ వచ్చింది. తను పంపించిన ప్లేసెస్ కి రేటింగ్స్ ఇవ్వడం ద్వారా కమిషన్ వస్తుందని నమ్మించాడు తర్వాత టాస్క్ కంప్లీట్ చేయడానికి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని నమ్మించాడు. తద్వారా బాధితుడు 33000/-. నష్టపోయాడు
● వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఎయిర్టెల్ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ను గూగుల్లో సెర్చ్ చేసి కాల్ చేశాడు. అది సైబర్ నేరస్తులకు వెళ్ళింది సైబర్ నేరస్తుడు బాధితున్ని స్క్రీన్ షేర్ యాప్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయవలసిందిగా కోరాడు. స్క్రీన్ షేరింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత బాధితున్ని అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయమని చెప్పారు ఆ తర్వాత బాధితుని అకౌంట్లో ₹8499/- డెబిట్ అయ్యాయి.
● సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి అన్నోన్ నెంబర్ నుంచి సిరిసిల్ల మున్సిపల్ ఎంప్లాయి అని కాల్ వచ్చింది. మున్సిపాలిటీ పన్ను డ్యూ ఉంది అని చెప్పి బాధితునితో 7880/- ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.
కావున పై విధంగా ఎవరు ఫోన్ చేసి చెప్పినా సైబర్ నేరస్తులని గుర్తించి వారికి ఏ విధమైన సమాచారం ఇవ్వద్దని ఎస్పీ గారు తెలిపారు.ప్రతి శనివారం నాడు వారంలో జిల్లాలో ఏ రకమైన సైబర్ నేరాలు నమోదు ఆనవో పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుదన్నారు..
*తీసుకోవలసిన జాగ్రత్తలు:-*
•నమ్మదగిన అప్స్ /వెబ్సైటు లలో మాత్రమే ఆర్డర్ చెయ్యండి.సోషల్ మీడియా లో యాడ్స్ చూసి ఆఫర్ లో వస్తున్నాయని, ఆ యాడ్స్ లో ఉండే నంబర్స్ కి కాల్ చేసి సైబర్ మోసాలకు గురి అవ్వదు
•మీ ఎస్బిఐ యోనో బ్లాక్ అయిందని పాన్ కార్డు అప్డేట్ చెయ్యమని వచ్చే మెసేజులు నమ్మకండి, ఇందులో ఉన్న లింక్స్ పై క్లిక్ చెయ్యకండి.
•సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.
•మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు…*సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి,కొంచెం ఆగి ఆలోచించండి.*
*సైబర్
[zombify_post]