in , ,

ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలి*

  • అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే పూర్తి ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను రూపొందించగలుగుతామని ఎలక్టో రల్ రోల్ అబ్జర్వర్ సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. అర్హుల అందరిని ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలన్నారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్ లో ఈఆర్ఓ,  ఏఈఆర్ఓ, వివిధ పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో రోల్ అబ్జర్వర్  సమావేశాన్ని నిర్వహించారు. తుది  ఓటరు జాబితా తయారీకి తీసుకుంటున్నా చర్యలను సమీక్షించారు.
    ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,  జిల్లాలో ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను రూపొందించడానికి బూత్ స్థాయి అధికారులతో పాటు పార్టీల తరపున కూడా బూత్ లెవల్ ఎజెంట్లను నియమించాలని తెలిపారు.
    ఓటరు జాబితాలో పేరు మార్పు, పొరపాట్లు మరియు బదిలీలు ఉన్నట్లయితే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి సత్వరం వాటిపై చర్యలు తీసుకోగలుగుతామని పేర్కోన్నారు.  అదే విధంగా పొలిటికల్ పార్టీలు క్షేత్రస్థాయిలో ఎమైన సమస్యలను గుర్తించినట్లయితే వాటిని జిల్లా ఎన్నికల అధికారికి గాని, రోల్ అబ్జర్వర్ కు గాని చరవాణిలకు సంక్షీప్త సందేశాల రూపంలో తెలియజేసినట్లయితే వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.  ఎలక్షన్ కమీషన్ జారీ చేసిన తేదిలలో ఎటువంటి మార్పులు చేయడానికి వీలు ఉండదు కాబట్టి ఆ తేదిలల్లోగా పటిష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని సూచించారు.
    దివ్యాంగ ఓటర్ల కోసం అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు ఉండేలా చూడాలన్నారు.  పోలింగ్ కేంద్రాలలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వీప్ కార్యకలాపాలని ప్రభావంతంగా చేపట్టి అర్హులందరూ ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు.  ముఖ్యంగా 18 -19 సంవత్సరాల యూత్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గాన్ని ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఐడెంటిఫై చేయాలన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో పటిష్ట ఓటరు జాబితా తయారీ కోసం తీసుకుంటున్నా చర్యలను జిల్లా డిప్యూటి ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్  ఎలక్టో రల్ రోల్ అబ్జర్వర్ కు వివరించారు.జిల్లాలో అగస్టు 21, 2023 నాటికీ జిల్లాలో 4,46,243 మంది ఓటర్లు ఉన్నారని అందులో 2,17,497 మంది పురుషులు, 2,28,730 మహిళలు ,16 మంది థర్డ్ జెండర్లు ఓటర్లుగా ఉన్నారని తెలిపారు.సెన్సెస్ ప్రకారం జెండర్ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1023 మంది మహిళలు ఉండగా, ఎలెక్టోరల్ జెండర్ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1052 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఇపి నిష్పత్తి 669 శాతం ఉందన్నారు.
    2వ ఎస్ఎస్ ఆర్ డ్రాఫ్ట్ రోల్ ను ప్రచురించి పొలిటికల్ పార్టీలకు అందించడంతో పాటు వాటిపై అభ్యంతరాలను స్వీకరించడానికి అగస్టు 26, 27 తేదిలలో సెప్టెంబర్ 2 మరియు 3 తేదిలలో నిర్వహించిన స్పేషల్ క్యాంపేయిన్ లను 547  పోలింగ్ కేంద్రాలలో స్పెషల్ క్యాoపెయిన్ లను నిర్వహించి ఫామ్ 6 లను,  ఫామ్ 7 , ఫామ్-8 లను స్వీకరించడం జరిగిందని అన్నారు.
    ఈ నెల 19 లోగా వచ్చిన అభ్యంతరాలు, ఆక్షేపణలను సవరించుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగుతుందని,  అనంతరం 28 వరకు వచ్చిన ఆక్షేపనలు, అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 4 న  ఫైనల్ పబ్లికేషన్ ఆప్ ఎలక్టోరోల్ ను ప్రచురించడం జరుగుతుందని వివరించారు.జిల్లాలో రెండు నియోజక వర్గాలలోని 547 పోలింగ్ కేంద్రాల కొరకు ఈఆర్ఓ లను, ఎఈఆర్ఓ లను నియమించడం జరిగిందని తెలిపారు.  అదే విధంగా ప్రతి బుధవారం  పొలిటిక్ పార్టీలతో సమావేశాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.   జెండర్ రేషియో లో తేడాలను గుర్తించిన పొలింగ్ కేంద్రాలలో క్షేత్రస్థాయిలో బిఎల్ఓ ల ద్వారా పరిశీలించేలా చూడడం జరిగిందన్నారు.జిల్లా వ్యాప్తంగా రెండు నియోజక వర్గాల గుర్తించిన  పిడబ్ల్యుడి ఓటర్లందరి   కొరకు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని తెలిపారు.  ఆరోగ్యవంతమైన తుది ఓటరు జాబితాను రూపొందించడం కేవలం బిఎల్ఓల బాద్యత కాదని వారితో పాటు  ప్రజలు, పార్టీలకు చెందిన ఎంజెట్లు కూడా బాగస్వాములు కావాలని అన్నారు.
    సమావేశంలో ఈఆర్ఓ లు ఆనంద్ కుమార్, మధు సూధన్ , తహశీల్దార్ లు తదితరులు పాల్గోన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై డి.సుధాకర్*

తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలకు సర్వం సన్నద్ధం*