చర్లలో మావోయిస్టు కొరియర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. వివరాలను సీఐ రాజగోపాల్ శుక్రవారం వెల్లడించారు.మండల పరిధిలోని వెంకచెరువు అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో పూసుగుప్ప వైపు నుంచి వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని పుల్లుమ్ గ్రామానికి చెందిన కుంజ ఉమేశ్ అలియాస్ భద్రుగా గుర్తించారు. ఇతను మావోయిస్టు కొరియర్‌గా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు. 2011 నుంచి మావోయిస్టులతో పని చేసినట్లు విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు.మావోయిస్టు నేతల ఆదేశాలతో ములుగు జిల్లా వెంకటాపురానికి వచ్చి కూలిపనులు చేస్తూ పోలీసుల కదలికలను తెలుసుకుంటూ ఛత్తీస్‌గఢ్ లోని కోమటిపల్లి, కొండపల్లికి వెళ్లి తెలంగాణ మావోయిస్టు నాయకులకు సమాచారం ఇస్తూ కొరియర్‌గా పని చేస్తున్నాడని వెల్లడించారు. ఈనెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ19వ వార్షికోత్సవ కరపత్రాలను మండలంలోని లెనిన్‌కాలనీ,పాతచర్లలో వేసేందుకు వస్తూ తనిఖీల్లో పట్టుబడ్డాడని తెలిపారు. ఎస్సైలు టీవీఆర్ సూరి, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
[zombify_post]