చర్ల మండలంలోని క్రాంతిపురం(రాజయ్య నగర్)పొడియం జ్యోతి(21)ను పాము కాటేయడంతోమృతి చెందింది.ఇంట్లో మంచంపై పడుకొనిని ద్రిస్తున్న జ్యోతి శుక్రవారం తెల్లవారుజామున కట్లపాము కాటేసింది.తననేదో కరుస్తోందంటూ జ్యోతి కేకలు వేయడంతో అక్కడేని ద్రిస్తున్న తండ్రి పొడియం రామయ్య వెళ్లి చూడగా పాము కరుస్తూ కనిపించింది.పామును చంపేసి రహదారి సౌకర్యం సరిగా లేకున్న చీకట్లోనే జ్యోతిని నానా అవస్థలు పడుతూ సుబ్బంపేట-చర్ల రోడ్డుకు తీసుకువచ్చి అక్కడ నుంచి ద్విచక్రవాహనంపై చర్ల ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైనవైద్యం కోసం భద్రాచలం తరలిస్తుండగా జ్యోతి మార్గం మధ్యంలో మృతిచెందింది.అంబులెన్సురాని దౌర్భాగ్య పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ గ్రామ ఆదివాసీలు వాపోతున్నారు.
[zombify_post]