బొండపల్లి: మండ లంలోని గొట్లాం బైపాస్ రోడ్డుకు సమీపంలో లారీ లో అక్రమంగా తరలి స్తు న్న 17 వేల 830 కేజీల పీడీ ఎస్ బియ్యాన్ని పట్టు కొని సీజ్ చేసినట్టు విజిలె న్స్ ఇన్స్పెక్టర్ బి.సింహా చ లం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్. కోట లోని నర్సింహ ట్రేడర్స్కు చెందిన యజమాని గ్రామాల్లోని పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాటిని నిల్వ చేసి అక్కడ నుంచి ఒడిశాలోని కొరాపుట్కు గత కొంతకా లం గా తరలి స్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో గురువారం గొట్లాంలోని బైపాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించగా లారీలో బాదం సతీష్ అనే వ్యక్తి 358 ప్లాస్టిక్ గోనె సంచుల్లో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు గు ర్తించామన్నారు. తదుపరి చర్యల ని మిత్తం బియ్యాన్ని గజపతినగరం సివిల్ సప్లై య్ డిప్యూటీ తహసీల్దార్ రవిశంకర్కు అప్పగించగా సంబంధిత నర్సింహ ట్రేడర్స్ యజమానిపై 6ఏ కేసు నమోదు చేసిన ట్లు తెలిపారు. పట్టుకున్న లారీని బొండ పల్లి పోలీసులకు అప్పగించామన్నారు.
[zombify_post]