in

శిథిలావస్థకు చేరిన కొత్తపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో బాస్కెట్ బాల్ కోర్టు

కొత్తపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో బాస్కెట్ బాల్ కోర్టు శిధిల వ్యవస్థకు చేరింది అని క్రీడాకారులు వాపోతున్నారు.దీనిపై స్థానిక ఎమ్మెల్యే కు తెలియచేయాలి అనే ఉద్దేశంతో క్రీడాకారులు ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు మరియు క్రీడాకారులు వినతిపత్రం సిద్దం చేశారు.ఈ వినతి పత్రంలో ఇలా వుంది డా॥బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, కొత్తపేట ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు మరియు క్రీడాకారులు వ్రాసుకొను విన్నపములు.కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట గ్రామంలోగల ప్రభుత్వ బాలుర పాఠశాలలో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణం: 2002 సం.రంలో జరిగినది. నిర్మాణం జరిగిన 23 సం.రంలో చాలా మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలలో పాల్గొని మన కొత్తపేట నియోజకవర్గానికి మంచి పేరు ప్రతిష్టలను తీసుకొని వచ్చినారు. మన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. ఇది ఇలావుండగా వర్ష ప్రభావం వల్ల మరియు కోర్టు చుట్టు ప్రక్కల వున్న వృక్షాలు పడిపోవడం వలన రింగ్

ఫోల్లు బాగా పాడైపోయినవి. వర్షం యొక్క నీరు కోర్టులో నిలిచిపోవడం వలన కోర్టు యొక్క ఫ్లోర్ బాగా

పాడవ్వడం మరియు ఫ్లోర్ దిగిపోవడం, అక్కడక్కడ గుంతలు, బీటలు రావడం జరిగింది. దీనివలన కోర్టు యొక్క క్రింద ఫ్లోర్ మరియు రింగ్ ఫోల్స్ శిథిలావస్థకు చేరినది. దీని వలన క్రీడాకారులకు ఆడుకోవడానికి మరియు రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కరముగా ఉంటున్నది.ప్రస్తుతం వున్న బాస్కెట్ బాల్ కోర్టు యొక్క నియమ నిబంధనలు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలలో మార్చడం జరిగింది. కావున తమరు సదరు పరిస్థితులకు తగినట్లుగా నూతన బాస్కెట్ బాల్ కోర్టును మరియు అధునాతన "ఫైడ్ లైట్స్" ఏర్పాట్లుతో ప్రభుత్వ బాలుర పాఠశాల నందు ఏర్పాటు చేయించుటకు తగు చర్యలు తీసుకొని మా క్రీడాకారులకు ప్రోత్సహించవలసినదిగాను, నూతన బాస్కెట్బాల్ కోర్టును అధనాతనంగా నిర్మించుటకు తగు ఏర్పాట్లు చేయించ వలసినదిగాను అందుకు తగిన ఏర్పాట్లు చేయించవలసినదిగా కోరిప్రార్ధిస్తున్నాము.

వై.ఎస్.ఆర్. జగన్  ప్రభుత్వంలో నాడు నేడు పథకం ద్వారా విద్యార్థులకి అన్ని విద్యా సౌకర్యములు కల్పించారు. దీనితోపాటు క్రీడాకారులు రాణించడానికి బాస్కెట్ బాల్ కోర్టు నిర్మించి జాతీయస్థాయిలో మన కొత్తపేట నియోజకవర్గానికి పేరు ప్రతిష్ఠలు తీసుకొనిరావడానికి తోడ్పాటు అందించవలసినదిగా కోరి ప్రార్ధించుచున్నాము అని కొత్తపేట బాస్కెట్ బాల్ క్రీడాకారులు వినతి పత్రం సిద్దం చేశారు.

దయచేసి శాసనసభ్యులు స్పందించి  బాస్కెట్ బాల్ కోర్టు బాగుచేసి నూతన కోర్టు కూడా నిర్మించి క్రీడాకారుల హృదయాలలో నిలుస్తారని ఆశిస్తున్నామని కొత్తపేట బాస్కెట్ బాల్ క్రీడాకారులు అంటున్నారు. 

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Kiran

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views
Popular Posts

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే టిడిపి- జనసేన పొత్తు : తంగిరాల సౌమ్య

మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం*