*బొబ్బిలి పట్టణానికి చెందిన చిక్కవరం జమిందారు వారసుడు, ప్రముఖ జర్నలిస్టు, రచ యిత, సమీక్షా విమర్శకులు రావు వెంకట ఆనంద కుమార రంగారావు .జాతీయ స్థాయి సంగీత నాటక అకాడమీ అమృత అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు భారత ఉపరా ష్ట్రపతి జగదీప్ ధనకర్ కార్యాలయం నుంచి బుధవారం సమా చారం అందింది.
ఈ నెల 16 న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమం లో లక్ష రూపాయల నగదు, ప్రశంస పత్రం అందించి సత్కరించ నున్నట్లు అందులో పేర్కొన్నారు. 85 ఏళ్ల వయస్సు కలిగిన రంగా రావు ప్రసిద్ధ సంగీత రికార్డుల సేకర్త, సంగీతకారుడు, కళా విమ ర్శకుడిగా పేరు గాంచారు. అనేక జర్నల్స్ రాశారు. సంగీత ప్రపంచానికి సంబంధించి దేశవిదేశాల నృత్య, సంగీత రీతులపై పలు సేకరణలు చేసి అధ్యయనం చేశారు. ఆయన విశ్లేషణాత్మకత ఎంతోమంది పండితులను, మేధావి వర్గాన్ని విశేషంగా ఆక ట్టుకుంది. రంగారావుకు సంగీత నాటక అమృత అవార్డు రావడంపై బొబ్బిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) తో పాటు పలువురు సంగీత, కళా, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
[zombify_post]