అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసి ప్రాంతంలో బోగస్( నకిలీ )కుల ధ్రువీకరణ పత్రాలతో ఆదివాసి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు పొందుతూ, రాజకీయ రిజర్వేషన్లు పొందుతూ, ఆదివాసుల హక్కులను అనుభవిస్తున్న బోగస్ నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్న, వారి భారతం పట్టేందుకు రేపు ఆదివాసి గిరిజన సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో పాడేరు ఐ టి డి ఏ ముందు ధర్నా. నిర్వహిస్తున్నామని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ సుందర్రావు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు జంపరంగి ఆనంద రాజ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చిన్నారావు తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ…..మాట్లాడుతూ: ఆదివాసి ప్రాంతంలో బోగస్ (నకిలీ) కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్న, ఆదివాసేతరులు రోజురోజుకు పెచ్చుమిరుతున్న పరిస్థితి ఎక్కువైంది. రెవెన్యూ అధికారులు ఆదివాసేతరులకు అమ్ముడుపోయి, నకిలీ బోగస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న పరిస్థితి చాలా దారుణమని, నకిలీ బోగస్ ధ్రువీకరణ పత్రాలు పొందుతూ పొందుతూ ఆదివాసి చట్టాలకు హక్కులను ఉల్లంఘిస్తూ, ఉద్యోగ, రాజకీయ, ఆదివాసుల సర్వహక్కులు అనుభవిస్తున్నారు. ఆదివాసేతరుల వల్ల ఈ ప్రాంతంలో సర్వ హక్కులు కలిగి ఉన్న ఆదివాసులు ఉద్యోగ ఉపాధి రాజకీయ అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడింది చెప్పారు. నకిలీలపై పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే ,రానున్న రోజుల్లో ఆదివాసులు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది . కనుక ఆదివాసి ప్రాంతం మేధావులు నిరుద్యోగ యువత నకిలీల భారతం పట్టేందుకు ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు .ఒకపక్క ఒకటి 1/70 చట్టం రక్షించాలని , మరోపక్క జీవో నెంబర్ 3 కు చట్టబద్ధత కల్పించి, ఆదివాసులకు వందకు వంద శాతం ఉద్యోగాలు కేటాయించాలని, ఉద్యమాలు జరుగుతా, మరోపక్క ఆదివాసులను కనుమరుగు చేసేందుకు రకరకాల ఎత్తుగడలతో ఆదివాసేతరులు కోరలు చాస్తూ కూర్చున్న పరిస్థితి ఉందని చెప్పారు.ఇలాంటి తరుణంలో ఆదివాసులు ఉద్యమం తప్ప మరో మార్గం లేని, పరిస్థితులు దాపురించిందని ఉన్నాయన్నారు.. గిరిజన చట్టాలు హక్కులు కాపాడుకునేందుకు, రేపు జరుగుతున్న నకిలీ బోకస్ కుల దృవీకరణ పత్రాల పొందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ పత్రాలు జారీ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని రేపు పాడేరు ఐటీడీఏ ముందు జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
[zombify_post]