- ప్రజలను మోసం చెయ్యడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరితేరిందని కాంగ్రెస్ పార్టీ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు.దుమ్ముగూడెం మండలంలో సీఐటీయూ అధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు చేస్తున్న దీక్షల్లో ఎమ్మెల్యే పాల్గొని కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో వెట్టిచాకిరి చేయించుకుంటుందని,పెరిగిన నిత్యవసరాలు ధరలకు అనుగుణంగా జీతాలను వెంటనే 26 వేలకు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు మరియు మూడు లక్షలు గా నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కనీసం మూడు నెలల నుండి అంగన్వాడీలలో కందిపప్పు లేని పరిస్థితి నెలకొందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అంగన్వాడి కార్యకర్తలు దీక్షలు చేస్తున్న సమయంలో కేంద్రాల తాళాలు పగలగొట్టి కేంద్రాలను పున ప్రారంభించాలని వింత ఆలోచనలు చేస్తుందని వీటిని మానుకోవాలని డిమాండ్ చేయడం చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తప్పక వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని ఏద్దేవా చేశారు.
[zombify_post]