గురు న్యూస్, విశాఖపట్నం : బాబు కోసం మేము సైతం,ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అనే నినాదం తో,చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను,నిరసిస్తూ గోపాలపట్నం పశ్చిమనియోజకవర్గంలో టిడిపి కార్యాలయం లో, టీడీపీ శ్రేణుల తో కలిసి, సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారు. ఈ కార్యక్రమం లో టీడీపీ జిల్లా నాయకులు వార్డ్ నాయకులు కార్యకర్తలు అధికసంఖ్యలోపాల్గొన్నారు. మరియు ప్రజలు కూడా సంతకాలు చేసి తమ నిరసన తెలియజేసారు.ఈ సందర్భంగా ,గణబాబు గారు మాట్లాడుతూ,స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్ చేశారు. ఇది చాలా దారుణమని FIR లో పేరు లేకుండానే అరెస్ట్ చేశారని ఈ కేసు న్యాయ స్థానంలో నిలబడే పరిస్థితి,లేదుఅని అన్నారు. ప్రధానమంత్రిని రాష్ట్రపతిని స్పీకర్ నీ ఉన్నతమైన పదవుల్లో కూర్చోపెట్టిన దేశంలో విజన్ ఉన్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారుఆనిఅన్నారు. ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబునాయుడుకి మద్దతుగా నిలిచారు. హైదరాబాద్లో విప్రో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఆయన మద్దతుగా నిలబడ్డారు. దేశంలోనే ప్రముఖ పార్టీ నాయకులు అందరూ కూడా చంద్రబాబునాయుడు గారి అరెస్ట్ ని అక్రమ అరెస్టు అని రాజకీయ నాయకులు అంటున్నారు అని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు వార్డ్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అధిక సంఖ్యలో ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు.
[zombify_post]