నిరుపేద విద్యార్థులకు నాన్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అర్బన్ మండల జడ్పీటీసీ మ్యాకల రవి అన్నారు…బుధవారం వేములవాడ అర్బన్ మండలం చింతల్ టాన గ్రామంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ..రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 15 వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు మరో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. జిల్లాలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వేములవాడ అర్బన్ గ్రామాల నుండి ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్య లో తరలిరావాలని అన్నారు…కళాశాల ప్రారంభోత్సవానికి ప్రతి గ్రామం నుండి విద్యార్థులను, ప్రజలను తిస్కురావడనికి కార్యకర్తలు ముందుండి బాధ్యత వహించాలని అన్నారు…ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం చాలా గొప్ప విషయమని, ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ కు కృతజ్ఞత భావంతో అధిక సంఖ్యలో కార్యకర్తలు బయల్దేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ, సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావుతో పాటు పలు గ్రామాల సర్పంచ్ లు , ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]