జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా అనకాపల్లి జిల్లాను కరువు జిల్లా గా ప్రకటించి,వెంటనే కరువు సహయకచర్యలు చేపాట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేసారు.ఈ మేరకు బుధవారం అయిన ఓప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో సెప్టెంబరు10 నాటికి ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 81,992 హెక్టార్లుకు 33,939 హెక్టార్లు సాగు నమోదు అయ్యిందని, ఖరీఫ్ గడువు ముగుస్తున్న సమయానికి సగం విస్తీర్ణం కూడా పంట నమోదు కాని పరిస్థితి ఏర్పడింది. జిల్లా సగటు వర్షపాతం మైనస్ 19 శాతం లోటు ఉందని, 24 మండలాలకు అనకాపల్లి, యలమంచిలి, మునగపాక, రాంబిల్లి, అచ్యుతాపురం, కె.కోటపాడు, నాతవరం, నక్కపల్లి,గొలుగొండ, మాకవరపాలెం, పాయకరావుపేట, సబ్బవరం మొత్తం 12 మండలాల్లో తీవ్ర వర్షపాతం లోటు ఉందన్నారు. వరి సాధారణ విస్తీర్ణం 54,584 హెక్టార్లుకు 25,110 హెక్టార్లు నమోదు అయ్యిందని,వరినాట్లు వేసిన ప్రాంతాల్లో కూడా వర్షాలు లేక వరినాట్లు ఏండిపోవడం, ఆకులు బీట బారడం వంటివి పరిస్థితి ఎర్పడు తుందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఓకలాగ లెదన్నారు కె కోటపాడు మండలం లోని కోన్ని గ్రామాలు, బుచ్చయ్య పేట, రావికమతం గోలుగోండ, సబ్బవరం, నక్కపల్లి లాంటి మండలాల్లో తీవ్ర నిరాశతో రైతులు ఉన్నారని తెలిపారు. ఉదాహరణకు ఒక నక్కపల్లి మండలం గొడి చెర్ల రెవెన్యూ పరిధిలో మొత్తం 2200 ఎకరాల వ్యవసాయ భూమి వుండగా ఇందులో సుమారు 1200 ఎకరాల్లో వరిసాగు చేశారు. వరిసాగు చేసేందుకు వరినాట్లు వేసి మొత్తం సిద్దం చేసుకున్నా వర్షాలు లేని కారణంగా ఆకులు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్క ఎకరం కూడా వరి వేయలేని దుస్థితి నేడు నెలకొన్నదని తెలిపారు. దీనితో రైతులు దిక్కుతోచక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతాంగాన్ని వ్వవసాయికూలిలను ఆదుకోవాలని, భవిష్యత్‌లో కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు తక్షణమే వ్వవసాయకార్మకులకు 20,వేలు రూపాయలు ఇవ్వాలని, 200రోజులు ఉపాధి హామీ పనులు కల్పించాలని, డ్వాక్రా మహిళ రైతులకు రుణమాఫీ చేయాలని రైతు భందు పధకం లాగ కూలిభందు పధకం అమలు చేయాలని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని, జలాశయ ఆయకట్టులు స్థిరీకరించాలన్నారు. వెంటనే అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపాట్టాలని వెంకన్న డిమాండ్ చేసారు.
[zombify_post]