పాడేరు నియోజకవర్గం, అల్లూరి జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోని ఆదర్శంగా నిలిచిందని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు.
జీకే వీధి మండలం పెదవలస గ్రామ సచివాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పాలన వ్యవస్థలోని జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మార్పులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామ సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతి సీఎం దానికి సంబంధించినటువంటి ప్రణాళికల సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి అద్భుత పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ , వైస్ ప్రెసిడెంట్ కుమారి, వైస్ ఎంపీపీ ఎస్ ఆనంద్ , ఎంపీపీ బి. కుమారి, జడ్పిటిసి కే. శివ రత్నం ,మండల ప్రెసిడెంట్ బొబ్బిలి లక్ష్మణ్ ,పిఎసిఎస్ చైర్మన్ ప్రసాద్, గ్రామ పెద్దలు శరబన్న, పెద్దన్న, వైస్ ఎంపీపీ యల్ దేముడు, త్రిమూర్తులు, సర్పంచు కే రామకృష్ణ, వ్యవసాయ మండల చైర్మన్ పి పాండు, ఎంపీటీసీ మత్స్యరాజు, కన్వీనర్ పి కృష్ణమూర్తి,చింతపల్లి ఎంపీపీ కే అనూష దేవి, జడ్పిటిసి బాలయ్య పడాల్, ఏఎస్ఆర్ జిల్లా పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ తిమోతి, కో కన్వీనర్ ఎల్ రమేష్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కే. గిరిప్రసాద్, మాజీ సర్పంచ్ ఎం రామారావు,నాయకులు కే శ్రీరాములు, రాము,దొరబాబు, సోములమ్మ, కె రామారావు,అధికారులు,సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]