పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా:
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నిరుద్యోగ యువతను మోసగించి, ప్రజాధనాన్ని దోచుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే తప్పేంటి అని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రూ.371 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపలపై చంద్రబాబునాయుడును పోలీస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో పాడేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భాగ్యలక్ష్మి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల కాలంలోనే దేశంలోని అత్యంత భారీ కుంభకోణానికి తెరలేపారని చెప్పారు. బోగస్ ఐటీ కంపెనీలు సృష్టించి ప్రజాధనాన్ని దోచుకొని విదేశాలకు పంపించేసారని దాన్ని తిరిగి మన దేశానికి రప్పించుకున్నారన్నారు. ఈ కుంభకోణంలో రూ.3,356 కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నట్లుగా స్కాం బయటపడిందన్నారు. ఆరోజు క్యాబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఒప్పందం ఒకలాగ చేసుకుని దాన్ని అమలు చేయడం అనేది మరో విధంగా చేశారని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సీమన్స్ కంపెనీతో జరిగిన ఒప్పందంలో ఆ కంపెనీ నుంచి రూపాయి చెల్లించకుండానే ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ 10 శాతం కింద రూ.356 కోట్లు ఇచ్చిందన్నారు.
రూ.356 కోట్లు కేటాయింపులకు సంబంధించి అప్పటి ఆర్థిక కార్యదర్శి కూడా చంద్రబాబు నాయుడు గారి నోటిమాట ఆధారంగానే కేటాయింపులు చేశామని ఆ ఫైల్ పై పెట్టిన నోటి దీనికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబునాయుడు పై అక్రమ కేసులు బలాయించారని చెబుతున్న ఆ పార్టీ నాయకులకు తాను ఒకటే తెలియజేసుకుంటున్నానని చట్టం తన పని చేసుకుంటూ పోతుందని, తప్పు చేస్తే కచ్చితంగా అరెస్టు చేయడమైనది సరైన పద్ధతేనని ఆమె సమర్థించుకున్నారు. 70 డొల్ల కంపెనీలను సృష్టించి ఆ పేరుతో రూ.371 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడు గారిపై జీఎస్టీ, ఇంటిలిజెన్స్, ఐటి, ఈడి, సెబి… ఇలా అన్ని ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేసిన తర్వాతే స్కాం నిజమే అని తేలాకే ఈరోజు అరెస్టు చేశారనే విషయాన్ని పునరుద్ఘాటాయించారు. తప్పు జరిగినప్పుడు అరెస్ట్ చేస్తే టిడిపి నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆమె ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వము, న్యాయశాఖ క్షమించకూడదని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోచుకున్న డబ్బులను తిరిగి రికవరీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, వ్యవసాయ సలహా మండల చైర్మన్ మినుముల సరస్వతి, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు గబ్బాడి చిట్టిబాబు, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి మంగ్లన్న దొర, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వనుగు బసవన్న దొర, సీతమ్మ, వంతల రాంబాబు, కుందేరి రామకృష్ణ, ఎంపీటీసీలు సిహెచ్ చిట్టెమ్మ, ఎల్ రామకృష్ణ పాత్రుడు, కే నరసింహమూర్తి , జి విజయలక్ష్మి, వైఎస్ఆర్సిపి నాయకులు ఎస్ మంగ్లన్న దొర, పసుపుల సత్యనారాయణ, ఎల్ సత్యవతి , ఎం కన్నాపాత్రుడు, కే సుశీల, వి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]