చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ డాక్టర్ ను నియమించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.స్థానిక సిపిఎం పార్టీ నాయకులు బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోయాయని సరైన డాక్టర్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే అధికారులు స్పందించి ఎంబీబీఎస్ డాక్టర్ ను నియమించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు,మండల కమిటీ నాయకులు బందెల చంటి,ఎన్ మూర్తి,షారోను,బాలాజీ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]